YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్రిపురలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు

త్రిపురలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు

అగర్తాల, ఫిబ్రవరి 4, 
ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర  లో ఎట్టకేలకు విపక్ష కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదిరింది.అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి త్రిపురలో కాంగ్రెస్  సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జట్టు కట్టాయి. సుదీర్ఘ చర్చల అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు ముందు ఆ పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదిరింది.త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ  స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ (BJP) అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లోవిజయం సాధించి బీజేపీ (BJP) ఇక్కడ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ దాదాపు 2 దశాబ్దాల పాటు ఇక్కడ అధికారంలో ఉంది.
ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సంబంధించి కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 60 సీట్లకు గానూ 47 సీట్లలో లెఫ్ట్ ఫ్రంట్  13 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. లెఫ్ట్ ఫ్రంట్ కు కేటాయించిన 47 సీట్లలో సీపీఎం 43 స్థానాల్లో, సీపీఐ, ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఒక ఇండిపెండెంట్ ఒక్కో సీట్ లో పోటీ చేస్తారు. అదనపు స్థానాల్లో నామినేషన్ వేసిన ఆయా పార్టీల అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకుంటారు. కాగా, బీజేపీయేతర కూటమిలో చేరడానికి అంగీకారం తెలపలేదు. తమ ప్రధాన డిమాండ్ అయిన గ్రేటర్ త్రిపురల్యాండ్ కు ఆమోదం తెలుపుతూ లిఖితపూర్వక హామీ ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేసింది.

Related Posts