YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హోళికి ముందే ఉద్యోగులకు గుడ్ న్యూస్

హోళికి ముందే ఉద్యోగులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6, 
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త రాబోతోంది. కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యాన్ని పెంచనుంది కేంద్ర ప్రభుత్వం. ఏడీ ని ప్రభుత్వం 38 శాతం నుంచి 42 శాతానికి పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిక్స్‌డ్ ఫార్ములా కింద డియర్‌నెస్ అలవెన్స్‌ను పూర్తిగా 4 శాతం పెంచే ఛాన్స్ ఉంది. ఇందుకు సంబంధించి అధికార వర్గాల నుంచి సమాచారం అందుతోంది.డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ ను ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 నుండి పెంచే నియమం కేంద్ర ప్రభుత్వం కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రస్తుతం డీఏను 4 శాతం పెంచనుందని సమాచారం.కేంద్రం ప్రభుత్వం డీఏ పెంచుతూ ప్రకటన చేస్తే.. కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (డీఏ) ప్రస్తుతం ఉన్న 38 శాతం నుంచి 42 శాతానికి పెరుగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ ప్రతి నెలా లేబర్ బ్యూరో విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) ఆధారంగా లెక్కించబడుతుంది. లేబర్ బ్యూరో అనేది కార్మిక మంత్రిత్వ శాఖలో ఒక భాగం.డీఏ 4.23 శాతం ఉండే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. మొత్తంగా ఇది 38 శాతం నుంచి 42 శాతానికి చేరుకుంటుందని, ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై ప్రతిపాదన చేస్తుందన్నారు. కేంద్రమంత్రివర్గం ఆమోదం తరువాత.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. అయితే, పెరగనున్న డీఏ జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుందన్నారు.

Related Posts