YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేజ్రీవాల్ కు లిక్కర్ సెగ

కేజ్రీవాల్ కు లిక్కర్ సెగ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6, 
ఢిల్లీ లిక్కర్ స్కాం  కు సంబంధించి ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  పేరు ప్రముఖంగా చోటు చేసుకుంది. నిజానికి ఇది అనూహ్య పరిణామం కాదు. అయినా, ఢల్లీ రాజకీయాలలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో తిరుగు లేని అధికారాన్ని  చెలాయిస్తున్న బీజేపీకి దేశ రాజధాని ఢిల్లీలో కొరకరాని కొయ్యలా తయారైన అరవింద్‌ కేజ్రీవాల్‌ ను ఇరకాటంలో పెట్టేందుకు ఈడీ చార్జ్ షీట్ రాజకీయ బ్రహ్మాస్త్రంలా అందివచ్చింది.కేజ్రీవాల్‌ టార్గెట్‌గా బీజేపీ కార్యకర్తలు నిరసన బాట పడుతున్నారు. తాజాగా ఢిల్లీలోఆప్‌ ఆఫీస్‌ ముందు బీజేపీ నిరసనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కేజ్రీవాల్ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మారుమోగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ కార్య‌క‌ర్త‌లు సీఎంకు వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను కంట్రోల్‌ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఆఫీస్‌ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. మరోవైపు ఈ ఆరోపణలను కేజ్రీవాల్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కేసు ఫేక్ అని.. ప్రభుత్వాలను కూలదోయడానికి బీజేపీకి ఈడీ సాయం చేయడమేనని కేజ్రీవాల్ ఆరోపించారు. లిక్కర్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ నాయర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఫేస్ టైం వీడియోకాల్ ద్వారా సమీర్ మహేంద్రుతో మాట్లాడించినట్లు ఈడీ ఛార్జ్ షీటులో పేర్కొంది. ఈ లావాదేవీల ద్వారా వచ్చిన సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడుకుందని ఆరోపించింది. లిక్కర్ లైసెన్సులు ఇప్పించేందుకుగానూ ఆప్ నాయకుల తరఫున విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నట్లు గుర్తించినట్లు ఈడీ చెబుతోంది.మరో వంక ఢిల్లీ లిక్కర్ స్కాం  ఢిల్లీలోనే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది.. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను  ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటుగా తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లు కూడా చేర్చడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్  ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే చర్చఆసక్తి రేకిస్తోంది.ఎమ్మెల్సీ కవిత అనుచరుడు వి.శ్రీనివాసరావును విచారించినట్లు ఛార్జిషీట్ లో ఈడీ తెలిపింది. కవిత ఆదేశాలతోనే అరుణ్‌పిళ్లైకి శ్రీనివాసరావు రూ.కోటి ఇచ్చారని ఈడీ స్పష్టం చేసింది. ఈ స్కామ్‌ ద్వారా వచ్చిన డబ్బునే ఆమ్‌ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టిందని ఈడీ వెల్లడించింది. రెండో చార్జ్‌షీట్లో ఈడీ ఈ విషయం స్పష్టం చేసింది. ఈడీ చెప్పిన వివరాల ప్రకారం, ఆప్‌ సర్వే టీమ్‌లకు దాదాపు రూ.70 లక్షలు చెల్లించింది. ఈ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్‌ ప్రచారంలో పాల్గొన్న వాళ్లకు డబ్బులు అందేలా చూశారని ఈడీ తెలిపింది. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఈడీ చార్జిషీట్ ను  అటు ఢిల్లీలో ఇటు ఏపీ,తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోంది.అయితే అటు ప్రతిపక్ష్లాల నుంచి అదానీ గోల్ మాల్ హస్త్రం దూసుకోస్తోంది. ఇదే అంశం పై ఇప్పటికే వరసగా రెండు రోజుల పాటు పార్లమెంట్ ఉభయ సభలను స్తంబింప చేసిన విపక్షాలు, అదానీ అస్త్రాన్ని నేరుగా ప్రధాని మోడీ మీదకు ఎక్కుపెడుతున్నాయి. చివరకు అదేమవుతుంది, ఇదేమవుతుంది  అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ...చివరకు ఏమవుతుంది అనేది ముందుముందు చూడవలసిందే .. అంటున్నారు.

Related Posts