YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆరని ఆదానీ ప్రకంపనలు...

ఆరని ఆదానీ ప్రకంపనలు...

హిండెన్ బర్గ్ నివేదిక సంచలనం రేపుతోంది. ప్రముఖ వ్యాపార వేత్త ఆదానీకి చెందిన ఆదానీ గ్రూప్స్ తన షేర్లలో అక్రమాలకు పాల్పడిందని హిండెన్ బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది. అప్పటి నుంచి ఆదానీ కంపెనీ షేర్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో పాటు స్టాక్ మార్కెట్ మొత్తాన్ని ఈ నివేదిక కుదిపిస్తోంది. గౌతమ్ ఆదానీ గురించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జేబులో వంద రూపాయలతో ముంబై వచ్చి ఆసియాలోనే అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పరిచారు. ఆయన జీవిత ప్రస్థానంలో ఎత్తుపల్లాల గురించి ఓ సారి చూస్తే…గౌతమ్ ఆదానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌లో జన్మించారు. ఆయన తండ్రి వస్త్ర వ్యాపారం చేసేవారు. కానీ తన తండ్రిలాగా వస్త్ర వ్యాపారం కాకుండా వేరే ఏదైనా కొత్తగా చేయాలని ఆయన ఆలోచించే వారు. ఆ కోరిక రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది.ఆయనకు చదువు పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదని, కాలేజీలో చదువుతున్న సమయంలో ఫెయిల్ అయినట్టు తనకు ఎప్పడూ కలలు వస్తుండేవన్నారు. ఆ భయంతోనే కాలేజీకి సరిగా వెళ్లే వారు కాదని ఆయన పలు ఇంటర్వ్యూట్లో చెప్పారు. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్ లో ఫెయిల్ అయినట్టు చెప్పారు.దీంతో ఏం చేయాలని బాగా ఆలోచించారట. ఆ తర్వాత జేబులో వంద రూపాయలతో ముంబైకి చేరుకున్నారు. ముంబైలో ఓ వజ్రాల వ్యాపారి వద్ద ఆయన పని చేశారు. ఆ క్రమంలో బిజినెస్‌కు కావాల్సిన మెలకువలను ఆయన నేర్చుకున్నారు. ఆ అనుభవం, మెలకువలతో ఆయనే స్వయంగా వజ్రాల వ్యాపారంలోకి దిగారు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగా ఆసియాలోనే నెంబర్ 1 వ్యాపార వేత్తగా ఎదిగారు. అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుండడం, కనీసం పార్లమెంట్‌లో ఈ విషయంలో ఓ ప్రకటన చేయడానికి గాని, చర్చించడానికి గాని సుముఖంగా లేకపోవడంతో రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ అండదండలతోనే అకస్మాత్తుగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నుడిగా ఎదిగిన అదానీకి దూరం జరిగి, తన విశ్వసనీయతను పెంపొందింప చేసుకొనే అవకాశం ఇది అంటూ ప్రముఖ ఆర్థికవేత్త, బిజెపి మాజీ ఎంపి డా. సుబ్రమణియన్ స్వామి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు చెప్పారు.అదానీ తనపై వచ్చిన ఆరోపణల నుండి కోర్టు ద్వారా విముక్తుడయ్యే వరకు అతనికి దూరంగా మోడీ జరగడం బిజెపి ప్రయోజనాల దృష్ట్యా చాలా అవసరమని డా. స్వామి స్పష్టం చేశారు. లేకుంటే వాటర్‌గేట్ స్కామ్‌లో 1973 -79లో రిపబ్లికన్‌లు తీవ్రం గా నష్టపోయిన విధంగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కూడా తీవ్రంగా నష్టపోతుందని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజులలో ఈ కుంభకోణాలకు సంబంధించి మరి అనేక కోణాలు సహితం బహిర్గతమయ్యే అవకాశంఉందని ఆయన సూచించారు. పారిశ్రామిక వేత్తలు, ఆర్ధికపరమైన అక్రమాలకు పాల్పడిన వారు రాజకీయ పలుకుబడులు ఉపయోగించుకోవడం మన దేశంలో కొత్త ఏమీ కాదు. ఎవ్వరు అధికారంలో ఉంటె వారికి సన్నిహితంగా ఉంటూ చట్టాల ఇబ్బందుల నుండి సులభంగా బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా ధీరూభాయి అంబానీకి మొదటగా ఆపన్నహస్తం అందించిన నాడు కేంద్రంలో వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ. ఆ తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయనను కాదని వెళ్లలేని పరిస్థితులు ఏర్పరచుకున్నారు.అదానీ సహితం తనకు మొదటగా తోడ్పడింది రాజీవ్ గాంధీ ఉదారవాద విధానాలని బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత కేంద్రంలోని ప్రతి ప్రభుత్వం తనకు సహకరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి మోడీతో ఏర్పర్చుకున్న సాన్నిహిత్యాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వ విధానాలను విశేషంగా ప్రభావితం చేస్తూ ఎవ్వరూ ఊహించనిరీతిలో తన సంపదను పెంచుకొంటూ ఉండడంతో అందరి దృష్టిని ఆకట్టుకొంటున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా మోడీ జరిపిన ప్రతి విదేశీ పర్యటనలో అదానీ కీలక పాత్ర వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన స్వయంగా గాని లేదా ఆయన కంపెనీలకు చెందిన సీనియర్ వ్యక్తి గాని, అధికార ప్రతినిధివర్గంతో కాకుండా, వ్యక్తిగత హోదాలో ప్రధానితో పాటు వెళ్లి, ఆయన కార్యక్రలాపాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా చెబుతున్నారు. అందుకనే ఈ నివేదిక రాజకీయంగా సహితం కలకలం రేపుతున్నది.భారత దేశానికి వివిధ మౌలిక ప్రాజెక్ట్‌లకు పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చిన అదానీని విదేశీ కుట్రలలో భాగంగా అపఖ్యాతిపాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విశేషమైన సానుభూతి కురిపిస్తున్నారు. నిజమే కావచ్చు. భారత్‌లో, ఆసియాలో అతిపెద్ద సంపన్నుడు, ప్రపంచంలో మూడో పెద్ద సంపన్నుడు మన పారిశ్రామికవేత్త కావడం మనకు గర్వకారణమే. ఆ సంపద అంతా సక్రమంగా సమకూర్చుకొని ఉంటె, ఆమేరకు ప్రభుత్వానికి ఎందుకని పన్నులు చెల్లించడంలేదు? అనే సందేహం వస్తుంది. ప్రపంచంలో మూడో పెద్ద సంపన్నుడైన, దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లించే తొలి 15 మందిలో కూడా లేరే? హిండెన్‌బర్గ్ ఆరోపించినట్లు అకౌంటింగ్ మాయాజాలంతో సంపదను పెంచుకున్నారా? తెలియాల్సి ఉంది. పైగా, ప్రభుత్వం ఆయన కోసం అనేక సమయాలలో నిబంధనలను అడ్డదిడ్డంగా మార్చివేయడం కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఉదాహరణకు మూడేళ్ళ క్రితం దేశంలో 8 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు నీతి ఆయోగ్, ఆర్ధిక మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనలను అతిక్రమించి, వాటిలో ఆరు విమానాశ్రయాలను ఏ విధంగా ధారాదత్తం చేశారు?పారిశ్రామిక వేత్తలు ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలలో అక్రమాలకు ఒంటరిగా పాల్పడలేరు. రాజకీయ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం తప్పదు. బలమైన రాజకీయ నాయకత్వం అండదండలు ఉన్నవారు చట్టాలకు అతీతంగా మనుగడ సాగింపగలుగుతున్నారు. మన దేశంలో కేవలం సత్యం రామలింగరాజు మాత్రమే ఇటువంటి ఆరోపణలపై ఆరేళ్ల పాటు జైలులో గడపవలసి రావడమే కాకుండా, తన కంపెనీని కూడా పోగొట్టుకున్నారు. అయితే, ఈ సందర్భంగా రామలింగరాజు ఓ బలమైన రాజకీయ నాయకుడిని ధిక్కరించి అతని వత్తిడులకు లెక్కచేయలేని పక్షంలో చట్టంముందు దోషిగా నిలబడవలసి రావడం బహిరంగ రహస్యమే..మార్కెట్ కథనాల ప్రకారం ముకేశ్ అంబానీ సహితం అదానీ మార్గంలోనే భారీ రుణాలను సమకూర్చుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయన తన రుణాలను నెమ్మదిగా ఈక్విటీ షేర్లుగా మార్చుకుంటూ వస్తున్నారని, అదానీ మాదిరిగా తనను అడిగే వారెవ్వరు అన్న ధీమాతో రుణాలను పెంచుకుంటూ పోవడం లేదని చెబుతున్నారు.

Related Posts