YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లే ఆఫ్‌ బాటపట్టిన డెల్‌..

లే ఆఫ్‌ బాటపట్టిన డెల్‌..

ముంబై, ఫిబ్రవరి 7, 
టెక్ దిగ్గజ కంపెనీలు వరుసగా లేఆఫ్స్ బాటపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్‌ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌, మెటా, ట్విట్టర్‌, ఇంటెల్‌, ఓఎల్‌ఎక్స్‌ తదితర టాంప్‌ కంపెనీలు ఇప్పటికే చాలా మందిని ఇంటికి పంపించేశాయి. ఈ జాబితాలోకి తాజాగా టెక్‌ దిగ్గజం డెల్‌ వచ్చి చేరింది. ప్రపంచవ్యాప్తంగా 6,650 మంది ఉద్యోగులకు తొలగించబోతున్నట్లు సంస్థ తెలిపింది. పర్సనల్ ల్యాప్‌టాప్ కొనుగోలులో క్షీణత, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లర్క్ వెల్లడించారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్‌లో ఈ తగ్గింపులు 5 శాతం వరకు ఉన్నట్లు తెలిపారు.కొవిడ్ మహమ్మారి విజృంభించిన క్రమంలో 2020లో ఈ సంస్థ ఉద్యోగాల కోత విధించింది. ఇప్పుడు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారిక ప్రతినిధి తెలిపారు. గతేడాది 2022, నవంబర్‌లో హెచ్‌పీ కంపెనీ సుమారు 6 వేల మందిని వచ్చే మూడేళ్లలో తొలగిస్తామని తెలిపింది. అందుకు పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గుతుండంతో సంస్థ లాభం పడిపోతోందని పేర్కొంది. అంతేకాదు సిస్కో సిస్టమ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ కార్పొరేషన్ వంటివి కూడా ఉద్యోగులను తొలగించాయి. 2022లో టెక్ సంస్థలు ఏకంగా 97,171 మందిని ఉద్యోగాల నుంచి పీకేశాయి.

Related Posts