విజయవాడ
మంగళవారం నాడు ఖుద్దూస్ నగర్ లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గోన్న మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు నిరసన సెగ తగిలింది. కేదారేశ్వరపేటలోని స్థానిక మహిళలు మాట్లాడుతూ పట్టా ఇచ్చారు.. స్థలం చూపండి అంటూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే , మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను ప్రశ్నించారు.
‘జగనన్న ఇల్లు’ పథకం కింద తమకు పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడో చూపించలేదని, తమకు స్థలం చూపించాలని వెలంపల్లి శ్రీనివాసరావును నిలదీసారు. నియోజకవర్గంలోని 34వ డివిజన్, ఖుద్దూ్సనగర్లో సోమవారం ‘గడపగడపకు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఇంటింటికీ వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. తమకు జగనన్న ఇల్లు వచ్చిందని, కానీ పట్టా ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థలం ఎక్కడ ఉందో చూపించలేదని శాంత కుమారి అనే మహిళ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వెలంపల్లి.. రెండవ విడతలో ఇల్లు కట్టించి ఇస్తారని బదులిచ్చారు. అయితే, ఆ రెండవ విడత ఎప్పుడు వస్తుందని, ఇల్లు ఎప్పుడు ఇస్తారని శాంత కుమారి మళ్లీ ప్రశ్నించారు.