కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత, బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు. వైష్ణవ్ చిన్నవయసులోనే కుటుంబానికి దూరం కావడం పెనువిషాదమని అయన అననారు. మెడిసిన్ చేస్తూ ఎంతో భవిష్యత్తు ఉన్న వైష్ణవ్ అకాల మరణానికి గురికావటం కలచివేసింది. ఒక్కగానొక్క కొడుకు ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని అన్నారు. దత్తాత్రేయ కుటుంబానికి సానుభూతి తెలియజేసారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దత్తాత్రేయను ఫోన్లో పరామర్శించారు. వైష్ణవ్ మృతికి సంతాపం తెలిపారు. వైష్ణవ్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దత్తాత్రేయ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమత్రి మహమూద్ అలీ, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, హరీష్ రావు,కడియం,జోగు రామన్నలు వైష్ణవ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు