పశ్చిమ గోదావరిలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు భీమవరంలో పర్యటించారు. ముందుగా పట్టణంలో ఉన్న అల్లూరి విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు. మన్యం ప్రజలను సంఘటితం చేసి స్వతంత్ర పోరాటం వైపు నడిపించిన యోధుడు అల్లూరి అని, మన్యం ప్రజల హక్కుల కోసం ఆయన పోరాడారని, స్వాతంత్య్రోద్యమంలో అసువులు బాసిన త్యాగ జీవి అల్లూరి సీతారామరాజు అని వెంకయ్య నాయుడు కొనియాడారు. అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు సేవాభావాన్ని అలవరుచుకోవాలని, విద్యార్థులు ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాలన్నారు. భీమవరంలోని అల్లూరి విగ్రహాన్ని విద్యార్థులు, యువత దర్శించి అవినీతి, అరాచక, అత్యాచార, అక్రమాల నిర్మూలనకు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలన్నారు. అనంతరం భీమవరం ఎస్‌ఆర్కేర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకున్న వెంకయ్యనాయుడు... కళాశాల 43వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐడియా ల్యాబ్ ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఐడియా ల్యాబ్ లోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం సఅజనవాటిక చిరుధాన్యాల వంటలను ప్రదర్శనను పరిశీలించారు.