దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న లిక్కర్ కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది.. దేశంలోని అనేకమంది ప్రముఖులు కు ఈ లిక్కర్ కుంభకోణం తో సంబంధం ఉన్నట్టు గుర్తించిన ఈడి ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వారి కి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలతో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా అనేక సార్లు సోదాలు నిర్వహించి కీలక సమాచారం,ఆధారాలు సేకరించింది, ఈ క్రమంలో శోధాలు చేస్తూనే అరెస్టులు మొదలుపెట్టింది.
ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద క్రేజీవాల్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రభుత్వానికి సంబంధించిన ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కి సంబధించిన వారికి నోటీసులు జారీ చేసిన ఈడి, ఎంపీ కొడుకు రాఘవ రెడ్డి ని అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తుంది.శుక్రవారం మద్యాహ్నం రాఘవను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తరువాత అదుపులోకి తీసుకున్నారు. శనివారం అయనను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ అరెస్తు చేసిన విషయం తెలిసిందే. .ముందు ముందు ఇంకెవరిని అరెస్ట్ చేయబోతున్నారో అని ఆసక్తి నెలకొంది