YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వదంతులను నమ్మకండి : డీజీపీ మహేందర్ రెడ్డి

వదంతులను నమ్మకండి : డీజీపీ మహేందర్ రెడ్డి

తెలుగురాష్ట్రాల్లో దొంగల భయం హద్దు మీరింది.  గ్రామాల్లో కొత్త వ్యక్తులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా, స్థానికులు దాడులు చేస్తున్నారు. విచక్షణారహితంగా కొట్టి చంపేస్తున్నారు.  తెలంగాణలో 24 గంటల్లో ఇద్దరిని కొట్టి చంపారు. ఆకాడికి పోలీసులు ప్రత్యేకంగా గ్రామాలకు వెళ్లి, దొంగలు గ్యాంగులు లేవు..కిడ్నాపర్లు లేరు అని చెబుతున్నా, గ్రామాలలో సందేహాలు, భయాలు వీడడంలేదు. తాజాగా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఈ దాడులపై స్పందించారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు ఎవరూ తిరగడం లేదని ఆయన పేర్కొన్నారు  సామాజిక మాధ్యమంలో తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం చట్టరిత్యా నేరమని  అన్నారు. వదంతులను నమ్మి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమం ద్వరా మీకేదైనా తప్పుడు వార్తలు, వదంతులు వస్తే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమంలో వస్తున్న కిడ్నాప్ ల వార్తలను నమ్మవదర్దన న్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరినీ వదిలేది లేదని హెచ్చరించారు. తప్పుడు వార్తలను ప్రజలు నమ్మి ఆందోళన చెందవద్దని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. గ్రామాల్లో కూడా సీసీటీవీ వ్యవస్థ పటిష్టంగా ఉందని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు.

Related Posts