YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త గవర్నర్ నజీర్ సంగతేంటీ

కొత్త గవర్నర్ నజీర్ సంగతేంటీ

విజయవాడ, ఫిబ్రవరి 13, 
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ని ఏపీ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 4 ఏళ్ల పాటు సర్వోన్నత న్యాయస్థానం జడ్జిగా సేవలు అందించిన జస్టిస్ అబ్దుల్ నజీర్... పలు కీలక తీర్పులు వెలువరించారు. మాజీ జడ్జికి గవర్నర్ గిరీ కట్టబెట్టడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించగా... బీజేపీ తిప్పికొట్టింది.మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఇందులో మార్పులతో పాటు కొత్త నియామకాలు ఉన్నాయి. నలుగురు బీజేపీ నేతలు సహా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్... కొత్తగా గవర్నర్లుగా నియమితులైన వారిలో ఉన్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛతీస్ ఘడ్ గవర్నర్ గా నియమించారు. వీరితో పాటు పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు పలువురిని బదిలీ చేశారు.ఆంధ్రప్రదేశ్ కి మూడో గవర్నర్ గా రానున్న ఎస్ అబ్దుల్ నజీర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించి.. ఈ ఏడాది జనవరి 4న పదవీ విరమణ పొందారు. 1958 జనవరి 5న అప్పటి మైసూర్ రాష్ట్రం ( ప్రస్తుతం కర్ణాటక) బెలువాయిలో జన్మించిన ఆయన... ముడిబిద్రిలోని మహావీర్ కళాశాలలో బీకాం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మంగళూరులోని కొడియాల్ బైల్ లోని ఎస్డీఎమ్ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి... కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. కర్ణాటక హైకోర్టులో సేవలు అందిస్తుండగానే ... పదోన్నతి పొంది, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేయకుండానే.. దేశ సరోన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా ఎంపికైన మూడో జడ్జగా గుర్తింపు పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా... 2017, ఫిబ్రవరి 17 నుంచి 2023 జనవరి 4 వరకు సేవలు అందించారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా దాదాపు నాలుగేళ్లు సేవలు అందించిన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్... పలు కీలక తీర్పులు వెల్లడించారు. ఆయోధ్య - బాబ్రీ మసీదు .. ట్రిపుల్ తలాక్ .. నోట్ల రద్దు .. గోప్యత హక్కు వంటి కీలక కేసుల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో ఆయన ఒకరు. 2019లో ఆయోధ్య వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ లో... జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా ఒకరు. ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తులు ఆయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. రిటైర్మెంట్ కి రెండు రోజుల ముందు నోట్ల రద్దుపై జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న ఇచ్చిన నోటిఫికేషన్ ని ఈ బెంచ్ సమర్థించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టంగా లేదని పేర్కొంది. అనంతరం... జనవరి 4న పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేరుని గవర్నర్ పదవికి కేంద్రం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఏపీ గవర్నర్ గా నియమిస్తున్నట్లు పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేశారు.మరోవైపు... రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ని గవర్నర్ గా నియమించడంపై... విపక్ష కాంగ్రెస్ కేంద్ర సర్కార్ పై విమర్శలు గుప్పించింది. మోదీ కోసం పనిచేసిన వారికి గవర్నర్ గిరీ ఇస్తున్నారని దుయ్యబట్టింది. మోదీ అదాని కోసం పనిచేస్తున్నారని... మోదీ కోసం పనిచేసిన వారు గవర్నర్లు అవుతున్నారని విమర్శిస్తూ... కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్వీట్ చేశారు. మరి ప్రజల కోసం ఎవరు పనిచేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరామ్ రమేశ్... 2012లో అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియోను షేర్ చేశారు. "పదవీ విరమణ తర్వాతి హోదాలు.. పదవిలో ఉన్నప్పుడు ఇచ్చే తీర్పులని ప్రభావితం చేస్తాయి" అని జైట్లీ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది కాంగ్రెస్ నుంచి వస్తోన్న విమర్శలను.. బీజేపీ ఖండించింది. శ్రీ రామ జన్మభూమి వివాదంపై తీర్పు వెలువరించడమే జస్టిస్ అబ్దుల్ నజీర్ చేసిన పాపంగా.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పరిగణిస్తున్నాయని... అందుకే గవర్నర్ గా ఆయన నియామకాన్ని తప్పుపడుతున్నాయని బీజేపీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు.

Related Posts