YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రాంతీయ పార్టీలో ఏకం కావాలి : చంద్రబాబు

ప్రాంతీయ పార్టీలో ఏకం కావాలి : చంద్రబాబు

కుమారస్వామి ప్రమాణస్వీకారం కోసం బుధవారం బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ బిజీబిజీగా వున్నారు. పలువురు ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యారు.  పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్ర మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో మాట్లాడారు.  వీరి భేటీలలో బీజేపీయేతర పార్టీలతో జాతీయ స్థాయిలో సమావేశం ఏర్పాటుపై చర్చ జరిగింది దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం అన్ని ప్రాంతీయ పార్టీలు కలసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 

అన్ని ప్రాంతీయ పార్టీలను బలోపేతం చేసేందుకే అందరం వచ్చామని అన్నారు. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టబోతున్న కుమారస్వామిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకే నేతలందరం వచ్చామని చెప్పారు. జేడీఎస్ కు ప్రాంతీయ పార్టీలన్నీ అండగా ఉంటాయన్నారు. కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా బీజేపీయేతర శక్తులు, ప్రాంతీయ పార్టలు ఏకతాటిపై రావాల్సిన అవసంర ఉందన్నారు. దేశ విశాల ప్రయోజనాల దృష్ట్యా ప్రాంతీయ పార్టీలతో కలిసి పని చేస్తామని చంద్రబాబు అన్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి శరద్ పవార్, సీతారాం ఏచూరి, అఖిలేష్ యాదవ్ తదితర నేతలంతా వచ్చారు.

Related Posts