YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాదయాత్రపై వైసీపీ డ్రోన్ నిఘా

పాదయాత్రపై వైసీపీ డ్రోన్ నిఘా

తిరుపతి, ఫిబ్రవరి 13,

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణతో జన ప్రభంజనంలా సాగుతున్న పాదయాత్రను డీఫేమ్ చేయడమే లక్ష్యంగా అధికార వైసీపీ సోషల్ మీడియా టీమ్ ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వైసీపీ తనకు మాత్రమే తెలిసిన రివర్స్ ప్రతిభకు పదును పెట్టింది.గ్రామంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించడానికి ముందే ఖాళీ రహదారులను డ్రోన్ ల ద్వారా చిత్రించి లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారని బిల్డప్ ఇచ్చుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. జనం లేని ఖాళీ ప్రాంతాలను ఫొటోలు తీసి పంపించాలంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తోంది. అలా చేయకపోతే సస్పెన్షన్ తప్పదంటూ హెచ్చరికలూ చేస్తోంది. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఏ రోజు కారోజు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటించబోయే గ్రామాలలో ఆయన కంటే ముందే పోలీసులు ద్విచక్రవాహనాలలో చుట్టేసి ఖాళీ రోడ్లను, మైదానాలను ఫొటోలు తీస్తున్నారు. అక్కడితో ఆగకుండా డ్రోన్ ల ద్వారా ఖాళీ ప్రదేశాలను చిత్రీకరిస్తున్నారు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు వైసీసీ సోషల్ మీడియా కార్యాలయానికి పంపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ సలహాదారు సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారు అని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఈ బృందమే తమకు అందిన ఫొటోల ఆధారంగా లోకేష్ పాదయాత్ర విఫలం అంటూ సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఇందు కోసం లోకేష్ పాదయాత్రలో జనం లేరు అని కనిపించేలా తమకు అందిన ఫొటోలను ఉపయోగిస్తున్నారు. ఇందు కోసం తమకు ఫొటోలు, డ్రోన్ చిత్రీకరణలను పంపించాలంటూ పోలీసులపై తీవ్ర మైన ఒత్తడి తీసుకు వస్తున్నారు. అసలు ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు పోలీసులు ‘పై’ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఆయన ప్రసంగించబోయినా అడ్డుకుంటూ, ఆఖరికి ఆయన మైక్ ను లాగేసుకోవడమే కాకుండా, నిలబడిన స్టూల్ ను కూడా గుంజుకున్న పరిస్థితి.ఇది చాలదన్నట్లు లోకేష్ పాదయాత్రకు జనాదరణ లేదని చిత్రీకరించేందుకు పోలీసులు పై వారి ఒత్తిడి మేరకు చేస్తున్న ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తున్నాయి. పోలీసుల ప్రయత్నాలపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి. అలాగే లోకేష్ పాదయాత్ర సాగే గ్రామాలలో పోలీసులు ముందుగానే ద్విచక్రవాహనాల్లో పర్యటించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందంటూ హెచ్చరికలు కూడా జారి చేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు మీడియా ముఖంగా ఆరోపణలు గుప్పించారు. సజ్జల కుమారుడి అత్యుత్సాహంతో లోకేష్ పాదయాత్రకు మరింత క్రేజ్ పెరుగుతోందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంతగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అంతకు రెండింతలుగా జనం లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో భాగం పంచుకునేందుకు వస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. లోకేష్ పాదయాత్రకు జనం లేరంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎంతగా ప్రచారం చేస్తుంటే అంతకు రెండింతలుగా నెటిజన్లు లోకేష్ పాదయాత్రకు జనం ప్రభంజనంలా కదిలి వస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని చెబుతున్నారు.

Related Posts