YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బ్రిటీష్ చట్టాలకు చరమగీతం పాడిన రోజు..

బ్రిటీష్ చట్టాలకు చరమగీతం పాడిన రోజు..

జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్

 రిపబ్లిక్‌ డేను పురస్కరించుకొని జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు తన పార్టీ నుంచి ఒక ప్రకటనను విడుదల చేశారు పవన్ కల్యాణ్.

అందులో "భారతదేశం దాస్య శృంఖలాల నుంచి సంపూర్ణంగా విముక్తి చెందిన రోజు.. బ్రిటీష్ వలసవాదుల చట్టాలకు చరమగీతం పాడిన రోజు.. మహా దార్శనికుడు శ్రీ అంబేద్కర్ నాయకత్వంలో రూపకల్పన జరిగిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా అవతరించిన రోజు.. నిజంగా జనవరి 26 మన జాతి గౌరవించదగిన రోజు.. మనకు పండుగ రోజు. ఈ శుభతరుణాన భారతీయులు అందరికీ నా తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రేమ పూర్వక శుభాకాంక్షలు" అంటూ తెలిపారు పవన్ కల్యాణ్.

Related Posts