YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి

రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి

టీటీడీ వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది. ఆభరణాల మాయంపై ఎంక్వైరీ జరగాలి.ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. టిటిడి వ్యవహారం భక్తులందరికీ సంబంధించిన విషయం. ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఏపిలో పోలీసురాజ్యం నడుస్తోంది. డైమండ్ మాయం కావడం పై రకరకాల వాదనలు ప్రభుత్వం చేస్తోంది. భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలి.  సిబిఐ దర్యాప్తు చేయించాలని అన్నారు. అధ్యక్షుడిగా నియామకం జరిగిన తరువాత జాతీయ కార్యవర్గ సమావేశం ఉండడంతో అధ్యక్షులు అమిత్ షా గారిని మర్యాద పూర్వకంగా కలిసాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈనెల 26న బాధ్యతలు స్వీకరిస్తున్నానని వెల్లడించారు. హరి బాబు గారి దగ్గర నుండి ఆరోజే బాధ్యతలు స్వీకరిస్తాను. నాపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు నిర్వహిస్తాననని అన్నారు. వీలైనంత త్వరగా కసరత్తు చేసి రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు చేసేందుకు నివేదికతో పాటు ప్రతిపాదనలు ఇవ్వాలని అమిత్ షా సూచించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గుంటూరులో ఈనెల 26న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసామని అన్నారు. మాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడమే మా ముందు ఉన్న బాధ్యత. టీటీడీ విషయంలో  రమణ దీక్షితులు డిమాండ్  చేస్తున్న స్వతంత్ర  విచారణ చేయిస్తే తప్పేంటని అన్నారు. ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు చిన్న వ్యక్తి కాదని గుర్తు చేసారు. 

Related Posts