రంగంపేట
మహాశివుడి శైకతశిల్పం ఆద్యాత్మిక పరిమరాలను వెదజల్లుతోం ది.మహాశివరాత్రిని పురష్కరించుకొని ఇద్దరు సిస్టర్స్ రూపొందించిన ముక్కం టీశ్వరుడి శైకతశిల్పం శివభక్తులను విశేషంగా సన్మోహనపరుస్తోంది. మహా శివరాత్రి శుభగడియన సమీపిస్తున్న వెళ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శివాలయంలో సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవిన సిస్టర్స్ రూపొందించిన ఈ సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది.క్షీరసాగర మధనంలో హలాహలాన్ని శివుడు సేవిస్తున్నట్టుగా సర్వం శివమయం అన్న నినాదంతో గరళకంఠుని సైకత శిల్పం రూపొందించి ప్రత్యేకంగా నిలిచి ఈ మహాశివరాత్రి సందర్బంగా వారి ప్రతిభను భక్తి భావంతో చాటుకు న్నారు.
ముస్తాబయిన శైవక్షేత్రాలు
ప్రసిద్ధి శైవ క్షేత్రాలు శివరాత్రికి ముస్తాబవుతున్నాయి..పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామంలో వేంచేసియున్న ప్రసిద్ధి త్రిలింగ క్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన రామేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామేశ్వర స్వామి వారికి కల్యాణ మహోత్సవలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. నత్తా రామేశ్వర స్వామి వారిని మహాశివరాత్రి శని త్రయోదశి ఒకే రోజు రావడంతో వివిధ ప్రాంతాలనుండి భక్త్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు తెలిపారు ...ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించి వచ్చే భక్త్తలకు క్యూలైన్లు, స్పెషల్ దర్శనం, రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.అలాగే చిన్నపిల్లలకు పాలు, రక్షిత మంచినీరు,మఙ్గిగ, పులిహోర,మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సేవలు ,మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు తెలిజేశారు....
ఆచంటీశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలు
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆచంటీశ్వర స్వామి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబయింది. విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయశాఖ ఈఓ రాము తెలిపారు. భక్తులు ఎక్కువసంఖ్యలో దర్శించుకునే శివాలయంలో దాదాపు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని, ప్రత్యక అభిషేకాలు నిర్వహించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయం వద్ద ప్రత్యేక దర్శనం, ప్రసాద వితరణ,ప్రవేశమార్గాలు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆలయాల వద్ద మంచినీటి సౌకర్యం, తాత్కాలిక టెంట్లు ఏర్పాటుచేయటం జరుగుతుందన్నారు.. వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం .. రథోత్సవానికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా .. పోలీస్ బందోబస్తు, రెవెన్యూ,మెడికల్ వారి సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు..
వాహనాల పార్కింగ్కు ప్రత్యేక స్ధలాలు కేటాయించి ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు సిబ్బందిని కూడా ప్రతి ఆలయం వద్ద ఏర్పాటుచేస్తున్నామని, శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. కావున స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు