YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

టార్గెట్ 70 అంటున్న కాంగ్రెస్

 టార్గెట్ 70 అంటున్న కాంగ్రెస్

ఎన్నికల ఏడాదిలోకి వచ్చేసింది 'తెలంగాణ'..! వ్యూహాలకు ప్రతివ్యూహాలు.. కౌంటర్లకు రీకౌంటర్లు... విమర్శలకు ప్రతివిమర్శలు... అటు నుంచి సౌండ్... ఇటు నుంచి రీసౌండ్... సెటైర్లు.. సీరియస్ కామెంట్స్… అబ్బో ఇలా ఒకటి కాదు...ఎన్నెన్నో సిత్రాలు చూసే టైం దగ్గర పడింది..! ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. రాజకీయ పార్టీలకు మాత్రం ఈ ఏడాది(2023) గట్టి సవాలే అని చెప్పొచ్చు! అసలే భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలు కదా...ఆ మాత్రం ఉంటుందిలే..! ప్రతి అడుగు పక్కాగానే కాదు ప్లాన్ తోనూ వేసే పనిలో ఉన్నాయి..! ఎలాగైనా హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని బీఆర్ఎస్ చూస్తుంటే... మిషన్ 90 అంటూ కమలనాథులు కార్యాచరణం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇప్పుడిప్పుడే లైన్ లోకి వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ కూడా.... ఓ నెంబర్ ను ఫిక్స్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగే దిశగా వెళ్తోంది.వచ్చే ఎన్నికల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కూడా ఓ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా వచ్చే ఎన్నికలపైనే చర్చ జరిగింది . ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ టార్గెట్ 70 సీట్లు అని కామెంట్స్ చేశారు. సింగిల్ గా పోటీ చేసే 70 సీట్లను గెలుస్తామని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఈ కామెంట్స్ బట్టి చూస్తే... టీ కాంగ్రెస్ కూడా ఓ క్లారిటీతోనే ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పోటీ ఉన్న నేపథ్యంలో... గెలిచే సీట్లపై పక్కాగా కన్నేయాలని హస్తం పార్టీ ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ లెక్కన 70 సీట్లపై సీరియస్ గా ఫోకస్ చేసి విక్టరీ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలతో ఠాక్రే వరుసగా భేటీలు అవుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల అజెండాపైనే సీరియస్ గా చర్చిస్తూ ముందుకు సాగుతున్నారు. విబేధాలను పక్కనబెట్టి....పార్టీ విజయానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు పాదయాత్రలో కూడా రేవంత్ రెడ్డి... ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. వంద సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలని చెబుతున్నారునిజానికి రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... బీఆర్ఎస్ విక్టరీ కొట్టి కుర్చీపై పాగా వేసింది. అయితే గత ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే... ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కంప్లీట్ గా వేరుగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు అన్నట్లు సాగిపోయింది...! కానీ ఈసారి జరిగే ఎన్నికల్లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. పక్కా త్రిముఖ పోరు అనే వాదన కూడా బలంగా ఉంది. కట్ చేస్తే కొత్త పార్టీలు లైన్ లోకి వచ్చేశాయి. ఆయా పార్టీల అధినేతలు కూడా పబ్లిక్ లో తెగ తిరిగేస్తున్నారు. పాదయాత్రలు కూడా చేస్తున్నారు. వారి ఎఫెక్ట్ ఉండటం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది..బీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్... ప్రత్యర్థులను మరోసారి బోల్తా కొట్టించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం... వచ్చే ఎన్నికలపై చాలా ఆశలే పెట్టుకుంది. ఆ పార్టీ అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నేతలు కూడా శ్రమిస్తున్నారు. అయితే మొన్నటి వరకు కాంగ్రెస్ విషయంమే కాస్త ఆందోళనకరంగా ఉండగా... ప్రస్తుత పరిణామాలతో ఎన్నికల యుద్ధానికి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. విబేధాలను పక్కనబెట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే దిశగా అధినాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. తాజాగా కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ ను కూడా పెద్దగా పట్టించుకోకుండా...కలిసిగట్టుగా పని చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts