
సౌత్ ఆఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబి.డివిల్లీర్స్ తన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్లకి గుడ్ బై చెప్పేసాడు. కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు ఆడిన డివిలియర్స్, దక్షిణాఫ్రికా జట్టులోనే కీలక ఆటగాడిగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ 11వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ బ్యాట్స్‌మన్‌గానే కాక కీపర్‌గా, ఫీల్డర్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. ఈ రోజు తాను ఓ కీలక నిర్ణయం తీసుకున్నానని తన ట్విట్టర్ ఖాతాలో డివిలియర్స్ ఇందుకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేశాడు.
I’ve made a big decision today pic.twitter.com/In0jyquPOK
— AB de Villiers (@ABdeVilliers17) May 23, 2018