YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వాళ్లిద్దరికి పట్టాభే టార్గెట్...?

వాళ్లిద్దరికి పట్టాభే టార్గెట్...?

విజయవాడ, ఫిబ్రవరి 24, 
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరంలో  టీడీపీ కార్యాలయంపై అధికార వైసీపీ కార్యకర్తలు  ముక్కుమ్మడి దాడి చేయడం.. అక్కడ ఉన్న వాహనాలను సైతం నిప్పుంటించడం.. ఆ క్రమంలో  తెలుగుదేశంఅధికార ప్రతినిధి  పట్టాభిని అక్కడి నుంచి  పోలీసులు  రహస్యంగా తరలించడం..  మరోవైపు బాధితులమైన తమపైన పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారంటూ.. విపక్ష తెలుగుదేశం ఆరోపించడం.. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక  వల్లభనేని వంశీ మార్క్ స్కెచ్ ఉందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీకి పార్టీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని...  దీంతో ఆ టికెట్ కోసం పోటీ పడుతున్న  దుట్టా రామచంద్రరావు వర్గానికి, ఇటు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గానికి చెక్ చెప్పినట్లు అయిందని... ఈ నేపథ్యంలో తమకు ఎదురే లేదంటూ వంశీ వర్గం   సంబరాలే చేసుకుందని అంటున్నారు... అయితే తన సొంత పార్టీలో అసమ్మతి సెగ మాత్రం నివ్వురు గప్పిన నిప్పులాగా అలాగే ఎన్నికలు అయిన తర్వాత కూడా ఉంటుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బాగా అర్థమైందనే ఓ చర్చ సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.మరోవైపు ప్రత్యర్థి టీడీపీ తరపున గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్టాబిని నిలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు పట్టాభికి అప్పగించేందుకు చంద్రబాబు సన్నాహాలు సైతం ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బచ్చుల అర్జునుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని అంటున్నారు.  అయితే ఓ వైపు సొంత పార్టీలో అసమ్మతి, మరోవైపు ప్రత్యర్థి పార్టీలో బలమైన నేత.. ఇంకోవైపు గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పక్కగా కంచుకోటగా ఉండడం... క్లియర్ కట్‌గా చెప్పాలంటే..  2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్‌లో సైతం.. గన్నవరం నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడిందంటే.. స్థానికంగా సైకిల్ పార్టీకి హార్ట్ కోర్ ఫ్యాన్స్  ఉండటమేననీ.... అందుకే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపు నల్లేరు మీద నడకే అయిందని..  అ లాంటి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పట్టాభి పోటీ చేస్తే.. తన గెలుపు సాధ్యం కాదన్న ఆందోళనతోనే  తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో భయభ్రాంతులు సృష్టించి వారిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే కార్యాలయంపైకి తన వర్గాన్ని వంశీ ఉసిగొల్పి దాడులు చేయించారనే చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో సర్క్యూట్ అవుతోంది.   పట్టాభి ప్రెస్ మీట్ పెట్టారంటేనే...  అధికార పార్టీలోని అగ్రనేతలకు చెమటలు పడతాయనీ, పట్టాభి విమర్శలు అంత సహేతుకంగా, ధాటిగా ఉంటాయన్న భావన వైసీపీ శ్రేణుల్లోనే ఏర్పడింది. అంత దూకుడుగా ఉన్న మరో  నాయకుడు ప్రస్తుత టీడీపీలో మరొకరు లేరనే ఓ టాక్ తెలుగుదేశంలోనే కాదు, విపక్ష వైసీపీలో కూడా ఉంది. గతంలో   పట్టాబి ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాదు.. ఆయన ఇంటిపై  వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.   ఇంకోవైపు.. వల్లభనేని వంశీ.. తెలుగుదేశం టికెట్‌పై గెలిచి.. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరారు.  ఆ క్రమంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబంపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ ఈ తరహా వ్యాఖ్యలపై అన్నీ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తర్వాత ఓ మీడియాలో లైవ్‌లో చర్చకు వచ్చి.. చంద్రబాబు ప్యామిలీకి వంశీ క్షమాపణలుచెప్పనప్పటికీ అప్పటికే వంశీకి వ్యక్తిగతంగా జరగాల్సిన డ్యామేజ్  జరిగిపోయింది.  ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం చంద్రబాబుపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అటు గన్నవరం నుంచి బరిలోకి దిగే వల్లభనేని వంశీపై, ఇటు గుడివాడ నుంచి బరిలో దిగనున్న కొడాలి నానిలపై టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులను దింపాలని చంద్రబాబు కృత నిశ్చయం ఉన్నారు. ఆ దిశగా పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ వర్గం.. తమదైన శైలిలో దాడులు చేసి.. ప్రతి పక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులోభాగమే.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై ఈ తరహా దాడులని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే సాగుతోంది.              

Related Posts