YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లిక్కర్ స్కామ్ లో రోజుకో మలుపు

లిక్కర్ స్కామ్ లో రోజుకో మలుపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24, 
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం  కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఇప్పటివరకు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ కేసులో దర్యాప్తు ఎదుర్కొంటుండగా.. తాజాగా ఈ సెగ ముఖ్యమంత్రిని తాకింది. ఢిల్లీ మద్యం కేసులో ఉప ముఖ్యమంత్రి సిసోడియా హస్తం ఉన్నట్లు ఆరోపణలు రాగా ఈ కుంభకోణంపై చేపట్టిన విచారణల్లో భాగంగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారని తెలిసిందే. ఈడీ, సీబీఐ వేర్వేరుగా విచారమలు జరుపుతున్నాయి. సిసోడియా సన్నిహితుడైన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, సమీర్ మహేంద్ర సహా ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. తాజాగా మరోసారి సిసోడియాకు సమన్లు ఇచ్చింది. వచ్చే ఆదివారం ఆయన అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పుడు ఈ కేసులో కేజ్రీవాల్ పీఏను ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై గూఢచర్య కేసు పెట్టింది సీబీఐ. ఈ కేసు పెట్టేందుకు అనుమతినివ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రిక్వెస్ట్ పెట్టుకోగా.. అందుకు ఆ శాఖ అనుమతినిచ్చింది. అవినీతి నియంత్రణ చట్టం కింద ఈ కేసు నమోదు చేసింది. 2015లో ఆప్ అధికారంలోకి వచ్చిన తరవాత పెట్టినట్టు సీబీఐ నిర్ధరించింది. ఢిల్లీలోని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సిసోడియా చేతుల్లోనే ఉంది. ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని ఇటీవలే సీబీఐ రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలన్నింటిపైనా రహస్యంగా నిఘా పెట్టారని, గూఢచర్యం చేశారని సీబీఐ తేల్చి చెప్పింది. స్వతంత్రంగా పని చేసే సంస్థలపైనా నిఘా పెట్టారని సీబీఐ చెబుతోంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, అందులోని ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో తెలుసుకునేందుకు 2015లో ఈ ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది ఆప్ సర్కార్. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇది ఏర్పాటైంది. ఇందుకోసం రూ.కోటి ఖర్చు చేసింది. 2016 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే... ఈ యూటిన్‌తో అవినీతికి సంబంధించిన వ్యవహారాలపై నిఘా పెట్టడంతో పాటు రాజకీయ అవసరాలు తీర్చుకునేందుకూ ఉపయోగించారని తీవ్రంగా ఆరోపిస్తోంది సీబీఐ.రూ.36 లక్షల మేర ఇందుకోసం ఖర్చు చేసిందనీ చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తోంది. ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అందరిపైనా కేసు నమోదు చేసేలా అనుమతినివ్వాలని సీబీఐ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ సక్సేనాను కోరింది. ఆయన ఆమోద ముద్ర వేసి కేంద్ర హోం శాఖకు పంపగా అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఫలితంగా సిసోడియాపై స్నూపింగ్ కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. దీనిపై సిసోడియా మండిపడుతున్నారు. అత్యంత దారుణం అంటూ ట్వీట్ చేశారు. అబద్ధపు కేసులు తనపై పెడుతున్నారంటూ విమర్శించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ఎదుగుతున్న కొద్ది తమపై ఇలాంటి కేసులూ పెరుగుతాయని అసహనం వ్యక్తం చేశారు సిసోడియా.

Related Posts