YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కోర్టుకు చేరిన లేడీ బ్యూరోక్రాట్స్.... ఇష్యూ

కోర్టుకు చేరిన లేడీ బ్యూరోక్రాట్స్.... ఇష్యూ

బెంగళూరు, ఫిబ్రవరి 24, 
కర్ణాటక మహిళా అధికారుల మధ్య రగులుకున్న చిచ్చు ఇప్పుడు కోర్టు ప్రాంగణానికి చేరింది. బాధ్యతలు మరిచి బజారుకెక్కిన మహిళా అధికారుల ఇష్యూని ఇప్పుడు బెంగుళూరు సిటీ సివిల్‌ కోర్టు హ్యాండిల్‌ చేస్తోంది. గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో రచ్చ రేపుతోన్న కర్నాటక ఐఏఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌ అధికారుల ఇష్యూ ప్రభుత్వాలకీ అత్యంత కీలకమైన రెండు ప్రధాన రంగాల్లో అలజడి సృష్టించింది. తాజాగా మహిళా అధికారుల కాంట్రవర్సీ కోర్టుమెట్లెక్కింది. దీంతో ఐఏఎస్‌ అధికారి రోహిణిపై కామెంట్స్‌ ఆపాలంటూ ఐజీపీ రూపా మౌద్గిల్‌కి కోర్టు సూచించింది.ఐఏఎస్‌ అధికారిణి రోహిణీ సింధూరికి పరువు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలుగానీ, ఆరోపణలు గానీ చేయరాదంటూ ఐజీపీ రూపాడి. మౌద్గిల్‌కు బెంగుళూరు సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీచేసింది. తనపై అనవసర కామెంట్స్‌ను చేయకుండా ఐపీఎస్‌ అధికారి రూపాని నిరోధించాలని కోరుతూ ఐఏఎస్‌ అధికారిణి రోహిణి కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రతిస్పందించింది.రోహిణి పర్సనల్‌ లైఫ్‌ని టార్గెట్‌ చేసే అసత్యాల ప్రచారాన్ని ఆపాలని, ఆధారరహిత వార్తలు, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ఫొటోలను ప్రచురించకూడదని మీడియాను సైతం బెంగుళూరు 74వ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశించింది. ఇప్పటికే రోహిణిపై చేసిన ఆరోపణలపై వివరణనివ్వాలంటూ కోర్టు రూపా మౌద్గిల్‌కు నోటీసులు జారీచేసింది.

Related Posts