న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24,
టర్కీలో కలకలం రేగింది. చుట్టూ విధ్వంసం నెలకొంది. టర్కీ స్నేహితులు అని పిలవబడే వారు కూడా సహాయం చేయలేనప్పుడు, మోడీ దూతలు టర్కీకి చేరుకోవడం ద్వారా త్రివర్ణ పతాకం విలువను పెంచుతున్నారు. టర్కీ భారతదేశానికి వ్యతిరేక వైఖరితో ఉంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ, ప్రాణాలను కాపాడటానికి ఒక చర్య తీసుకున్నారు. ఆ తర్వాత టర్కీలోనూ చప్పట్లు కొట్టగా, పాకిస్థాన్‌లోనూ మోడీపై ప్రశంసలు కురిపించారు.టర్కీలో హిందుస్థాన్ జిందాబాద్.. పాకిస్థాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి జయ జయకారాలు.. మోదీ సర్కార్ చర్య అంతర్జాతీయ దౌత్య సమీకరణాలన్నింటినీ మార్చివేసింది.. టర్కీలోని భూకంప బాధితుల వద్దకు భారత్ మొదట రెస్క్యూ టీమ్‌ను పంపింది.. ఏ దేశం ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్నా.. నేనున్నానంటూ భారత్ అభయహస్తాన్ని అందిస్తుంది. వారి కన్నీటిని తుడిచేందుకు ముందుకు వస్తుంది. మహా విలయంతో మాటలకందని విషాద సంద్రంలో మునిగిన టర్కీకి ‘ఆపరేషన్ దోస్త్’తో అండగా నిలిచింది భారత్. ఎన్డీఆర్ఎఫ్, డాగ్ స్క్వాడ్‌లను ఆ దేశానికి పంపి భూకంప శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను రక్షించడంలో కీలక పాత్ర పోషించింది. దీనికి తోడుగా భూకంప బాధితుల కోసం ప్రత్యేక విమానాల్లో వైద్య పరికరాలు, మందులు, ఇతర అత్యవసరాలను పంపింది భారత్. ఈ విషయంలో ప్రధాని మోదీ చూపిన చొరవను టర్కీ పాలకులు మనసారా మెచ్చుకున్నారు.భూకంప బాధిత టర్కీకి కష్టకాలంలో అండగా నిలుస్తామంటూ కొన్ని దేశాలు కేవలం మాట సాయానికి పరిమితమయ్యాయి. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించి చేతులు దులుపుకున్నాయి. అయితే ఈ విషయంలో భారత ప్రధాని మోదీ మాటలకు పరిమితంకాకుండా.. దీన్ని చేతల్లో చేసి చూపించారు. భారత్ రుణం తీర్చుకోలేనిదంటూ టర్కీ పాలకులు, ప్రజల నుంచి ప్రశంసలు పొందారు.టర్కీ అంతటా హిందుస్థాన్ జిందాబాద్ నినాదాలు మిన్నంటడం చూస్తుంటే.. ప్రధాని మోదీ తీసుకున్న ప్రత్యేక చొరవ దీనికి కారణంగా కనిపిస్తోంది.. మోదీ దేవదూతలా అక్కడివారికి కనిపిస్తున్నారు. భూకంపం వచ్చి ఆ దేశం అతలాకుతలమైన తర్వాత.. చాలా వేగంగా స్పందించి సహాయక బృందాలను పంపిన మొదటి దేశం భారత్ నిలిచింది. టర్కీ భూకంపం వార్త తెలిసిన వెంటనే ప్రధాని మోదీ 152 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని అక్కడికి పంపించారు.ఈ బృందంలో 18 నెలల వయసున్న కవలలను ఇంటి వద్దే వదిలిన ఓ తల్లి కూడా సభ్యురాలిగా అక్కడి వెళ్లారంటే దాని వెనుక ప్రధాని మోదీ అందించిన స్ఫూర్తి కావడం విశేషం. అక్కడి ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఆమె యూనిఫాం వేసుకొని దేశం కాని దేశానికి తరలి వెళ్లింది. “నేను నా కవల పిల్లలను నా అత్తమామల దగ్గర వదిలేశాను. నేను ఇంత కాలం వారిని విడిచిపెట్టడం ఇదే మొదటిసారి. కానీ ఆపరేషన్‌కు స్వచ్ఛందంగా ముందుకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేదని సుష్మా యాదవ్ తెలిపారు. ఆపరేషన్‌కి వెళ్లే సమయంలో ఆమె తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేదని సబ్ ఇన్‌స్పెక్టర్ శివాని అగర్వాల్ తెలిపారు.అధికారులు దౌత్య నిబంధనలు పూర్తి చేయడానికి సమయం లెక్కచేయకుండా వందల కొద్దీ పత్రాలను ప్రాసెస్ చేశారు. అక్కడికి చేరుకొన్న భారత బృందం 10 రోజుల పాటు వేలాది మందికి సేవలు అందించి ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చింది.
మొత్తం మూడు బృందాల్లో 152 మంది సభ్యులను, ఆరు జాగీలాలను అక్కడకు పంపేందుకు గంటల్లోనే సిద్ధం చేశారు. వీరిలో కేవలం కొందరికే దౌత్య పాస్‌పోర్టులు ఉన్నాయి. కోల్‌కతా, వారణాసిలోని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఫ్యాక్స్, ఈమెయిల్స్‌లో పంపిన వందల పత్రాలను విదేశాంగ శాఖ రాత్రికి రాత్రే ప్రాసెసింగ్ చేయడం వెనుక ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి కోణం కనిపిస్తుంది. ప్రతి క్షణం టర్కీకి మన బృందాలను పంపించేందుకు ఆయన తీసుకునన చొరవ చెప్పాల్సిన అవసరం లేదు. టర్కీ దౌత్య అధికారులతో మాట్లాడుతూ.. మన అధికారులకు దిశా నిర్ధేశం చేశారు ప్రధాని మోదీ.ఆపరేషన్ దోస్త్‌లో పాలుపంచుకున్న భారత రిస్క్యూ టీమ్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారితో ప్రత్యేకంగా భేటీ అయిన ప్రధాని.. మీ సేవలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేశాయని కొనియాడారు. మహా విలయంలో చిక్కుకున్న టర్కీకి బాసటగా నిలిచిన భారత్.. యావత్ ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకుంటోంది. విపత్కర పరిస్థితుల్లో టర్కీకి నిలిచి భారత్ తన అంతర్జాతీయ పరపతిని మరింత పెంచుకుంది. ఈ దిశగా ప్రధాని మోదీ చేసిన మార్గదర్శనం దేశానికి ప్రత్యేక గౌరవాన్ని సాధించిపెట్టంది.