YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై నీళ్ళు చల్లిన దేవేగౌడ

కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యం     ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పై నీళ్ళు చల్లిన  దేవేగౌడ

కాంగ్రెసేతర, బీజేపీయేతర.. అని కేసీఆర్ అంటే, జేడీఎస్ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన తీవ్ర తర్జన భర్జనల అనంతరం ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ రావాలనుకున్నారు. కానీ ఇవాళ ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో నిన్ననే బెంగుళూరుకి వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళారు. ఇదే సమయంలో తాజాగా దేవేగౌడ ఒకింత ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో దేవేగౌడ మీడియాతో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ దేవేగౌడ ఏమంటున్నారంటే.. ఫెడరల్ ఫ్రంట్ సాధ్యంకాదు అని. కేంద్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేకుండా కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యం అని దేవగౌడ తేల్చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసే రేపట్లో బీజేపీ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పడుతుందని అయన అన్నారు. ఒకవైపు కర్ణాటకలో పరిణామాలు ఫెడరల్ ఫ్రంట్‌కు దారులు అని టీఆర్ఎస్ వాళ్లు చెప్పుకుంటున్నారు. అక్కడ ఏర్పడుతున్నది కాంగ్రెస్ మద్దతుతో, కాంగ్రెస్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న కూటమి అని వీళ్లకు అర్థం కావడం లేదో ఏమో. కాంగ్రెసేతర ఫ్రంట్ సాధ్యంకాదు అని ఇప్పుడు దేవేగౌడ కూడా అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ బెంగళూరు వెళ్లినప్పుడే ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌కు జేడీఎస్ ఓకే చెప్పిందని కేసీఆర్ అంటే.. ఆ మాటలు నీటిమూటలే అని పేర్కొనడం జరిగింది. ఎన్నికలు అయిపోతే ఇదే జేడీఎస్ అవకాశాన్ని బట్టి అటు కాంగ్రెస్ వైపుకో ఇటు బీజేపీ వైపుకో చేరిపోవడం ఖాయమని తేల్చేయడం కూడా జరిగింది. చివరకు అదే జరిగింది. ఇప్పుడు తన తనయుడిని సీఎంగా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్‌ను పొగడక తప్పదు దేవేగౌడకు. మరి ఫెడరల్ ఫ్రంట్ మాటేంటో! 

Related Posts