YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిరుద్యోగ నిర్మూలనే భారస ప్రభుత్వ లక్ష్యం

నిరుద్యోగ  నిర్మూలనే భారస ప్రభుత్వ లక్ష్యం

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు  తరలి వచ్చిన వైనం.పెరిక  హాస్టల్ భవన్ లో  కీకిరిసిన  నిరుద్యోగ యువత. 72 కంపెనీలు తొమ్మిది వేల ఉద్యోగాలకు  ఎంపికలు.నగరాలకు వెళ్లి ప్రముఖ సంస్థ ల్లో  ఉద్యోగ అవకాశాలు వెతుక్కోలేక  ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటి ముంగిటకు  ప్రముఖ  పలు రకాల సాఫ్ట్వేర్ కంపెనీలను ఆహ్వానించి వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించిన కనుమంత రెడ్డి శశిధర్ రెడ్డి అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు  అన్నారు .  కోదాడ పట్టణంలోని పెరిక భవన్లో బిఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజక వర్గ మాజీ ఇంచార్జ్  కన్వంత్ రెడ్డి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన మెగా జాబ్ మేళను ఆయన ప్రారంభించి మాట్లాడారు. బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు నేడు తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు పెట్టడానికి పోటీలు పడుతున్నాయన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాదు నగరాన్ని ఐటీ పార్క్ గా హబ్ గా తీర్చిదిద్దారన్నారు. దీనితో నేడు ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంబీఏ ,ఎంసీఏ వంటి ఉన్నత విద్యలు పూర్తిచేసిన ఎంతోమంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అన్నారు. కోదాడ ప్రాంతం మొదటి నుండి విద్య వాణిజ్య రంగాల్లో పేరుగాంచిందని అన్నారు. గత రెండు దశాబ్దాల కాలం నుండి కోదాడలో ఇంజనీరింగ్ కళాశాల లు  నగరాలకు దీటుగా స్థాపించబడ్డాయి అన్నారు. నిరుద్యోగ యువత కు ఈ మెగా జాబ్ మేళా కల్ప తరువు వంటిదని కొనియాడారు.కే ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ అందిసత్య మాట్లాడుతూ, వేలాది మంది నిరుద్యోగ యువతకు కోదాడ జాబ్ మేళా వేదికగా కావడం  అభినందనీయమన్నారు. విద్యా అర్హతలు ఉండి కూడా సమాచార లోపంతో ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఇటువంటి తరుణంలో స్థానికంగా జాబ్ మేళాను నిర్వహించి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన శశిధర్ రెడ్డి ఆలోచన ప్రశంసనీయమన్నారు. కోదాడ పరిసర ప్రాంతా గ్రామాల్లో వేలాదిమంది అర్హత కలిగిన ఉన్నత విద్యావంతులు ఉండడం మానవ వనరుల  అభివృద్ధికి తార్కాణం అన్నారు. మెగా జాబ్ మేళా నిర్వాహకులు నిరుద్యోగ యువత పాలిటి ఆశా జ్యోతి రెడ్డి మాట్లాడుతూ  తల్లిదండ్రుల ఆశయాలు పిల్లల భవిష్యత్తు మీదనే ఆధారపడి ఉంటాయన్నారు. కోదాడ నియోజకవర్గ ప్రాంతంలో వేలాదిమంది ఉన్నత విద్యార్హతలు పూర్తి చేసిన విషయం గమనించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే  లక్ష్యంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశానన్నారు ,పిల్లలకు ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బలపడతాయని భావించే తల్లిదండ్రులకు ఆసరాగా ఈ జాబ్ మేళా ను నిర్వహించానని తెలిపారు. భారస కూడా ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగులకు అండగా నిలిచిందన్నారు. అదే ప్రభుత్వ సంకల్పంతో తాను కూడా పలు రకాల కంపెనీలను ఆహ్వానించి  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే చిరు ప్రయత్నం చేశాను అన్నారు. కోదాడ నియోజకవర్గం తన కుటుంబాన్ని ఉద్యోగాలు పొందిన యువతను చూస్తుంటే తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. అందరి సహకారంతో భవిష్యత్తులో మరెన్నో జాబ్ మేళాలు నిర్వహిస్తానన్నారు.బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు లు మాట్లాడుతూ, ప్రముఖ కంపెనీలు కోదాడ కు రావడం ఎంతో గర్వకారణం అన్నారు.ఈ సందర్భంగా పలువురు ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు అక్కడికక్కడే జాయినింగ్ ఆర్డర్స్ అందజేశారు.

Related Posts