మచిలీపట్నం
సీఎం జగన్ రైతులను నిలువునా దగా చేస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రైతుల భరోసా పేరుతో రైతులను నిలువునా ముంచేశారు. ఎన్నికల ముందు రైతులకు 15 వేలు ఇస్తామన్నారు. ఎన్నికల తరువాత 7500 ఇస్తున్నాడు, కేంద్ర ఇస్తున్న 6 వేలు కలుపుకొని 13500 ఇస్తున్నామని డబ్బా కొడుతున్నాడు. రైతు భరోసా పేరుతో జగన్ చెప్పేవన్నీ అబద్దాలే రైతులకు వేల కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసం, మాయ అని అన్నారు. రైతుల ఆత్మ హత్యల్లో ఆంధ్ర ప్రదేశ్ ౩ వ స్థానంలో వుంది. ఇప్పటివరకు ౩ వేలమంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి అన్నాడు, ఎంత మందికి ఇచ్చాడు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడు. ధాన్యం కొనుగోళ్ల లో లేనిపోని షరతులు పెట్టి రైతులను రోడ్డు న పడేసాడు. ఏ పంటకు మద్దతు ధర లభించలేదు, ధాన్యం సేకరణకు 37 లక్షల టన్నులకు కుదించారు. జగన్ మరిన్ని అప్పుల కోసం మోటార్లకు, మీటర్లు పెట్టి రైతు మెడకు వురి బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని నాశనం చేసాడు. ఎన్నికల ముందు యూనిట్ 1.50 పైసలకు ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తరువాత 5.50 పైసలు చేసాడు. ఆక్వా జోన్ లు అని రైతులను నిలువునా ముంచాడని అన్నారు.
వ్యవసాయంలో క్రాపు హాలిడే లాగ, ఆక్వా లో కూడా హాలిడే ప్రకటిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్ పది వేలు, ఇరవై వేలు వస్తుంటే ఇప్పుడు డెబ్భై వేలు, లక్ష వస్తుంది. రైతులు వడ్డీలు కట్టలేక ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా రైతులకు ప్రభుత్వం మాయమాటలు కాకుండా నిజాయతీతో వారికీ మద్దతుగా నిలవాలని అన్నారు.
ప్రకటనలు కాకుండా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని అన్నారు.