YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారానే దేశ అభివృద్ధి ఘనంగా సైన్స్ దినోత్సవం

శాస్త్ర, సాంకేతిక రంగాల ద్వారానే దేశ అభివృద్ధి ఘనంగా సైన్స్ దినోత్సవం

కాకినాడ, ఫిబ్రవరి 28
శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి జరుగుతుందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు.  మంగళవారం కాకినాడలోని ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న ఐడియల్ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఐడియల్ కళాశాల, జన విజ్ఞాన వేదిక కాకినాడ శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సభకు కళాశాల ప్రిన్సిపాల్ టీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా ఎన్హెచ్టి శాస్త్రవేత్త డాక్టర్ వై శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను, సైన్స్ తీరుతెన్నులను విద్యార్థులకు వివరించారు. గతంలో భారత దేశంలో అనేక పరిశోధనలు జరిగాయని ప్రస్తుత పరిస్థితుల్లో వెనకబాటు పట్టాయన్నారు. ప్రస్తుతం అమెరికా, రష్యా వంటి దేశాలతో పరిశోధన రంగంలో దేశం వెనకబడి ఉందన్నారు. సైన్స్ ఒక్కటే సాక్షాలతో సహా నిలబడుతుందన్నారు. ఎటువంటి మార్పుని దానికి కారణమైన విధానాన్ని సైన్స్ పూర్తి ఆధారాలతో నిరూపిస్తుందని చెప్పారు. మూఢనమ్మకాలను వ్యతిరేకించేది ఒక్క సైన్స్ మాత్రమేనన్నారు. యువత దేశ శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఆశయాలను అలవర్చుకోవాలని  శివప్రసాద్ కోరారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర పాటర్న్ సభ్యుడు డాక్టర్ సిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ నిరంతరం నాటి ఆదిమ సమాజం నుంచి నేటి నాగరికత వరకు సైన్స్ని మానవుడు వినియోగించుకుంటున్నడ న్నారు. సైన్స్ ద్వారానే ప్రజల్లో విజ్ఞానం పెరుగుతుందన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ స్టాలిన్ మాట్లాడుతూ ప్రశ్నించే తత్వాన్ని దాన్ని చెప్పే జవాబును  సైన్స్కు మాత్రమే ఉందన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పధాన కలిగి ఉండాలని సూచించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి పి చిరంజీవి కుమారి, జనవిజ్ఞాన వేదిక కాకినాడ శాఖ అధ్యక్షుడు కెఎంఎంఆర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు అనంతరం నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Related Posts