కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా వేదికపై సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, మమతా బెనర్జీ, మాయావతి వంటి హేమాహేమీలంగా కొలువుతీరారు. ప్రమాణస్వీకారం పూర్తి కాగానే జాతీయగీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత వేదికపై ఉన్న పెద్దలంతా ఒకరితో మరొకరు కరచాలనం చేసుకుంటూ, చేతులు గాల్లో ఊపుతూ సంతోషంగా గడిపారు. ఇంతలోనే చంద్రబాబు వద్దకు రాహుల్ గాంధీ వచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత రాహుల్ భుజంపై చంద్రబాబు చేయి వేసి, అభినందించారు. కొన్ని క్షణాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే కాంగ్రెస్, టీడీపీ అధినేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం, మాట్లాడటం... ఊహించనటువంటి ఒక కొత్త సన్నివేశాన్ని ఆవిష్కరించింది.