YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏప్రిల్ 11న రాజధాని విచారణ

ఏప్రిల్ 11న రాజధాని విచారణ

రాజమండ్రి, ఫిబ్రవరి 28, 
సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన కేసులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభపరిణాం అన్నారు సీనియర్‌ రజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర విభజనకు సంబంధించిన కేసులో ఏప్రిల్ 11వ తేదీన తదుపరి విచారణ జరగనుందని తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అభివృద్ధి కారణంగా ఏపీకి న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సహా కేంద్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని స్పష్టంగా అఫిడవిట్ లో వివరించారని తెలిపారు ఉండవల్లి.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన విద్యుత్ బకాయిలను అఫిడవిట్ లో వివరించారని చెప్పారు. గతంలో చంద్రబాబును కూడా ప్రభుత్వం తరఫున ఇదే విధంగా అఫిడవిట్ ఫైల్ చేయమని అడిగానని, చేస్తానని చెప్పారు… కానీ, చేయలేదని ఈ సందర్భంగా వివరించారు. అఫిడవిట్ లో ప్రస్తావించిన అంశాలన్నీ ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి 9 తొమ్మిదేళ్లు గడిచింది.. మరో ఏడాదిలో విభజన చట్టం అమలు గడువు కూడా ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, తెలంగాణ వికాస్ కేంద్ర సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. రాజ్యాంగ ధర్మాసనాలు కొన్ని ప్రత్యేక కేసులపై విచారణ చేపట్టిన నేపథ్యంలో కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనాల కారణంగా బుధవారం విచారణకు రావాల్సిన రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం వాయిదా వేసింది. ఇక, ఈ కేసుపై విచారణ ఎప్పుడు చేపడతారో తేదీని ప్రకటించాలని ఉండవల్లి తరపు లాయర్ విజ్ఞప్తి చేశారు. దీంతో.. ఏప్రిల్ 11కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాల ధర్మాసనం వెల్లడించిన విషయం విదితమే.

Related Posts