YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమిత్ షాతో బీజేపీ నేతల భేటీ మిషన్ 90పై దిశా నిర్దేశం

అమిత్ షాతో బీజేపీ నేతల భేటీ మిషన్ 90పై దిశా నిర్దేశం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28, 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, వివేక్, జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరంతా కలిసి అమిత్ షాను కలిశారు. ఈ సమావేశంలో బీజేపీ మిషన్ 30, ఎన్నికల ప్రణాళికపై రాష్ట్ర నేతలకు షా సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. కర్ణాటక తర్వాత తెలంగాణలో అనుకూల వాతావరణం మొదలు అయిందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస - బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టారు. మార్చి నుంచి పోలింగ్ బూత్ స్వశక్తి కిరణ్ కార్యక్రమానికి బీజేపీ నేతలు శ్రీకారం చుట్టనున్నారు. మిషన్‌ 90, ఎన్నికల ప్రణాళికలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కమలం గుర్తును ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలా చర్యలు చేపట్టాలని అమిత్‌షా హితబోధ చేసినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది బీజేపీ. కర్ణాటక తర్వాత తెలంగాణలో పాగా వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై సమయం దొరికినప్పుడల్లా అటాక్‌ చేస్తోంది.ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ నేతలకు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలంతా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, వివేక్, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts