YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని బిల్లు...?

అసెంబ్లీ సమావేశాల్లో  రాజధాని బిల్లు...?

విజయవాడ, మార్చి 6, 
ఏసీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. మార్చి 14వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి సంబంధించి ఉభయ సభలనూ ఉద్దేశించి 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ప్రసంగిస్తారు. ఇక శాసనమండలి సమావేశాలు కూడా మార్చి 14వ తేదీనే ప్రారంభం కానున్నాయి.ఇక కీలకమైన బడ్జెట్ ను మార్చి 17వ తేదీన ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి 15వ తేదీన గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించడంతో పాటు సీఎం కూడా మాట్లాడే అకాశం ఉంది. ఈ తేదీలపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బీఏసీ (బిజినెన్‌ అడ్వైజరీ కమిటీ) సమావేశంలో సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలనే అంశాలను నిర్ణయించనున్నారు. 14 నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని బీఏసీ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు.నిజానికి ఎమ్మెల్సీ ఎన్నికల పూర్తి అయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ సర్కార్ యోచించింది. ఎన్నికలతో సంబంధం లేకుండా... సభను నిర్వహించేందుకు సిద్ధమైపోయింది. ఇదే కాకుండా మార్చి 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జీ-20 సదస్సులు జరగనున్నాయి. వీటికంటే ముందే శాసనసభ సమావేశాలను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంటే 27వ తేదీలోపే ముగిసే అవకాశం ఉంటుంది.ఈ సమావేశాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. తాను విశాఖకు షిప్ట్ అయిపోతానని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని సీఎం జగన్ కొద్దిరోజుల కిందట ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా జగన్... కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది. మరోవైపు 3 రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆ పరిణామాల ఆధారంగా ముఖ్యమంత్రి ప్రకటన ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత… మండలిలో వైసీపీ బలంగా భారీగా పెరగనుంది. ఇది కూడా అధికార పార్టీకీ కీలకం కానుంది. ఇదిలా ఉంటే.. విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కూడా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ పరిపాలను రాజధానిగా మారుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి.

Related Posts