YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నల్లమల్లలో మదర్ టైగర్ ఆపరేషన్

నల్లమల్లలో మదర్ టైగర్ ఆపరేషన్

కర్నూలు, మార్చి 9, 
నల్లమల అటవీ ప్రాంతం అయిన  ఆత్మకూరు డివిజన్, గుమ్మాడాపురం అటవీ ప్రాంతంలో మదర్ టైగర్ టీ 108 ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. కనిపించకుండా పోయిన తల్లి పులి కోసం అటవీ శాఖ ఆధ్వర్యంలో గుమ్మడ పురం నల్లమల్ల అటవీ ప్రాంతంలో సుమారు 70 ట్రాప్ కెమెరాలతో అన్వేషణ కొనసాగుతుంది. ఇప్పటి వరకూ తల్లిపులి ఆచూకీ కనిపించలేదు.  చివరి ప్రయత్నంగా ప్రత్యేక డ్రోన్ కెమెరా బృందాలను అటవి శాఖ అధికారులు రంగంలో దించారు.  డ్రోన్ కెమెరాలతో గుమ్మడాపురం అడవి శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు.  ఏరియల్ సర్వేలో తల్లిపులిని గుర్తిస్తే పిల్ల పులులను దాని వద్దకు చేర్చే అవకాశం ఉంది. అయితే తల్లి పులి కదలికను అంచనావేసి ఆ తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ తల్లి పులి జాడ తెలియకపోతే   తిరుపతి జూ కు ఆడ పసి పులి పిల్లలను తరలించే అవకాశం ఉంది.   తల్లి పులి మనుగడపై రోజు రోజుకు  అనుమానాలు పెరుగుతున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.  చివరి సారిగా డిసెంబర్ లో ట్రాప్ కెమెరా లో ట్రేసౌట్ చేశారు. ఆ తర్వాత దాని ఆచూకీ నేటి వరకు అటు విశాఖ అధికారులు గుర్తించింది లేదు. ప్రస్తుతం కూడా పులి పిల్లలు లభ్యమైన అటవీ పరిసరాల్లో ఎక్కడా కూడా తల్లి పులి పాద ముద్రలు లభించలేదు. తలిపులి ఉందా లేదా అన్నది సస్పెన్స్‌గా  మారింది.  అటవీశాఖ ఆధ్వర్యంలో పట్టువదలని విక్రమార్కుల్లా డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ వైల్డ్ కంజర్వేషన్ దృష్టికి తీసుకెళ్లి మదర్ టైగర్ఆపరేషన్ ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ టి సి ఏ కూడా రంగంలో దిగింది. ఈ బృందం ఆత్మకూరులోనే ఉండి.. పర్యవేక్షిస్తున్నట్లు ఎన్ ఎస్ టి ఆర్  అధికారులు చెబుతున్నారు.   అధికారుల అన్వేషణ ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం బిక్కు బిక్కుమంటూ ఆత్మకూరు అటవీ అధికారుల చెంతే నాలుగు ఆడ పసి పులి కూనలు మగ్గుతున్నాయి. అధికారులు వీటి సంరక్షణకు పడుతున్న పాట్లు  పడుతున్నారు. తల్లి పులి వయస్సు 8 సంవత్సరాలు ఉండొచ్చని, టైగర్ నంబర్ 108 గా గుర్తించామని అధికారులు చెబుతున్నారు. పులి పిల్లలు లభ్యమైన ప్రాంతంలో తల్లి పులి అరుపులు విన్నామని సిబ్బంది వెల్లడించారు. తల్లి కోసం గాలిస్తున్నామని.. పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమన్నారు. చాలా ఉద్రేకంగా ఉంటుందని కాబట్టి అత్యంత జాగ్రత్తగా అంచనా వేస్తున్నామన్నారుఒకేసారి నాలుగు పిల్లలకు పులి జన్మనివ్వడం అరుదని.. పైగా అడ పులులు కావడం దేశ చరిత్రలోనే అత్యంత అరుదని అటవీ శాఖ అధికారులు  చెబుతున్నారు. తల్లి పులి జాడ లేకపోతే రెండేళ్లు సంరక్షించి అటవీ ప్రాంతం లో వదిలేస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు.

Related Posts