YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నేములో...ఏముంది... లైట్ తీస్కో...

నేములో...ఏముంది... లైట్ తీస్కో...

న్యూఢిల్లీ, మార్చి 9, 
మోడీ సర్కార్ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో నగరాలు పట్టణాలు, వీధులు, ప్రాంతాల పేర్లు మార్చడానికి ప్రయత్నాలు ఎక్కవ అయ్యాయి. అయితే ఈ పేర్ల మార్పు ప్రక్రియపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.  గతంలో భారత్ పై దాడులు చేసి, దేశాన్ని దోచుకోవడం ఆలయాలను ధ్వంసం చేయడం వంటి దారుణా లకు పాల్పడిన రాజుల పేర్లు ఇప్పటికీ ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలోని రోడ్లకు, వీధులకు కొనసాగడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు స్పందించింది.దాడులకు పాల్పడినవారు పెట్టిన పేర్లను మార్చాలని కోరిన ఈ వ్యాజ్యాన్ని సుప్రీం కొట్టివేసింది. భారతదేశం  ఈ ఆధునిక యుగంలో కూడా గత కాలపు సేతు బంధనాలను తవ్వుకోవడానికే పరిమితం అవ్వడం సరి కాదని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.  దేశంలోని అనేక రోడ్లు, వీధులు, ప్రదేశాలు, పట్ట ణాలు, నగరాలకు ఇప్పటికీ ఒకప్పటి    పేర్లే కొనసాగడం ఏమిటని ప్రశ్నిస్తూ,  పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి   దేశాలలో హిందూ మతానికి చెందిన వ్యక్తుల పేర్లను తొలగించిన విషయాన్ని తన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంలో పిటిషనర్ ప్రస్తావించారు.అయితే ఈ పిటిషన్ ఏ విధంగా చూసినా ప్రజాప్రయోజన వ్యాజ్యం కిందకి రాదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సమాజంలో విద్వేషాలు పెచ్చరిల్లడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలకు వంత పాడేలా ఈ పిటిషన్ ఉందని వ్యాఖ్యానించింది. దేశంలో మత విద్వేషాలు పెచ్చరిల్లాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ పిటిషనర్ ను మందలించింది.ఇటువంటి పిటిషన్లు వేయడం భావ్యం కాదని విస్పష్టంగా పేర్కొంది.  అనివార్యం అనుకుంటే తప్ప పేర్ల మార్పు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ రీతిలో పేర్ల మార్పు అన్నది స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయేమో తప్ప దీర్ఘ కాలంలో ఇది సమాజంలో చీలికలకు, అశాంతికి దారి తీస్తుందని  అభిప్రాయపడింది.  భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో మతోన్మాదానికి స్థానం లేదని అ  ప్రజలంతా సౌభ్రాతృత్వంతో మెలగాలని రాజ్యాంగ ఉపోద్ఘాతంలోనే ఉందని కోర్టు స్పష్టం చేసింది.  

Related Posts