YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పావురం కాలికి చిప్... ఆరా తీస్తున్న నిఘా బృందాలు

పావురం కాలికి  చిప్... ఆరా తీస్తున్న నిఘా బృందాలు

భువనేశ్వర్, మార్చి 9, 
ఒడిశా తీరంలో స్పై పావురం..కాళ్లకు కెమెరా, మెక్రోచిప్‌తో తీరంలో పావురం చక్కర్లు..ప్రేమకు చిహ్నాలైన ఈ పావురాళ్లతో దేశానికి ముప్పు పొంచి ఉందా..? డ్రాగన్‌ కంట్రీ ఏమైనా వ్యూహ రచన చేస్తోందా..? వీటి వెనుక ఉగ్ర కుట్ర దాగుందా..? ఇవి గూఢాచారి పావురమా..? ఈ పిజియోన్స్‌ వెనుక మిస్టరీ ఏంటి..?కాలుకు మైక్రోచిప్ కట్టి ఉన్న ఓ పావురాన్ని మత్స్యకారులు కనుగొన్నారు. పావురం రెక్కపై కోడ్ నంబర్‌తో ఒక మెసేజ్ ఉన్న ఈ పావురం తీరు అనుమానం రేకెత్తిస్తోంది..వెంటనే మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు.. ఇది చైనా నుంచి వచ్చిన పావురమని భావిస్తున్నారు.అసలే సరిహద్దులో చైనా కుట్రలు పన్నుతున్న వేళ.. ఇవి ఏ దేశపు పావురాలు? ఈ విదేశీ పావురాలకు ఇక్కడేం పని..కాలి కెమెరాలతో ఇక్కడేం చేస్తున్నాయి..ఇవేమైనా గూఢాచారి పావురాళ్లా..?ఏంటీ లెక్క అని ఆరా తీస్తున్నారు పోలీసులు.వీటి వెనుక కుట్ర ఏమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.

Related Posts