YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కవితకు అండగా కేటీఆర్

కవితకు అండగా కేటీఆర్

హైదరాబాద్, మార్చి 10, 
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పై ఇంతవరకు పెదవి విప్పని మంత్రి కల్వకుట్ల తారక రామా రావు, ఎట్టకేలకు పెదవి విప్పారు. నిజానికి, ఇంచు మించుగా ఆరేడు నెలలుగా ఢిల్లీ మద్యం కుంభ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ప్రతి చార్జి షీట్ లోనూ ఆమె పేరు ఒకటికి పది సార్లు ప్రస్తావనకు వస్తూనే వుంది. ముద్దాయిగా ఆమె పేరు చేర్చలేదు అనే గానీ, కేసు మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. ఉచ్చులు బిగుస్తున్నాయి. అయినా  ఇంతవరకు ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు కల్వకుట్ల కుటుంబంలో ఎవరూ  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు గురించి ఒక్క మాట మాటలాడలేదు. ఇప్పుడు ఈడీ సమాన్లు జారీ చేసి, ఆమె అరెస్ట్ కు రంగం సిద్దం చేస్తున్న సంకేతాలు అందుతున్న సమయంలో కేటీఆర్ చెల్లెలికి మద్దతుగా తెర మీదకు వచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణం గురించో, అందులో కవిత పాత్రకు సంబంధించి వస్తున్న ఆరోపణల గురించో కాకుండా, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ టార్గెట్ గా విమర్శలు చేశారు. కవితకు సమన్లు జారీ చేసింది ఈడీ  కాదు మోడీ అంటూ విరుచుకు పట్టారు. దేశంలో జుమ్లా లేదంటే హమ్లా అన్నట్లు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై  ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు ఇచ్చారన్నారు. అవి ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లు అని విమర్శించారు. కేంద్రం చేతిలో  దర్యాప్తు  సంస్థలు కీలక బొమ్మలుగా మారాయని  కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి చేస్తోందని మండిపడ్డారు.  దేశమంతా అవినీతిపరులు తాము మాత్రం సత్యహరిశ్చంద్రుని కజిన్ బ్రదర్స్ అన్నట్లు  బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ నేతలు మీద ఉన్న కేసులు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.ఆయన లిక్కర్ స్కాంలో కవితకు.. ఈడీ నోటీసులు ఇవ్వటాన్ని ప్రస్తావించారు. మా ఎమ్మెల్సీ విచారణను ఎదుర్కొంటారని.. విచారణకు హాజరవుతారని స్పష్టం చేశారు కేటీఆర్. ఇది రాజకీయ వేధింపులుగానే చూస్తున్నామని.. అంతా డ్రామా నడుస్తుందన్నారు. రాజకీయంగా ప్రజాకోర్టులో తేల్చుకుంటామని.. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఒక్క కవితకే కాదని.. 10, 12 మంది బీఆర్ఎస్ నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేశాయన్నారు. కవిత మొదటిది కాదు.. చివరిది కాదని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నేతలకు దాడులు చాలా జరుగుతాయన్నారు కేటీఆర్. రాజకీయ వేధింపులను రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. అయితే, కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని విమర్శించడం వలన రాజకీయంగా కేటీఆర్ కు ఏదైనా మేలు జరిగితే జరగవచ్చును కానీ, మోడీపై కేటీఆర్ చేసిన విమర్శలు  విచారణ ఎదుర్కుంటున్న కవితకు ఏ విధంగాను మేలు చేయక పోగా, సమస్యను మరింత జటిలం చేసే ప్రమాదముందని, అంటున్నారు.

Related Posts