YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆచితూచి...కేసీఆర్ అడుగులు...

ఆచితూచి...కేసీఆర్ అడుగులు...

హైదరాబాద్, మార్చి 10, 
ఒకరోజు అటూ ఇటూ కావచ్చునేమో కానీ ఢిల్లీ మద్యం కేసులో  బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత, అరెస్ట్  ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయమే సర్వత్రా వినిపిస్తోంది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  సమన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళిన  కవితకు  ముఖ్యమంత్రి కేసేఆర్ ధైర్యం చెప్పి పంపించారనీ,  ఒక తండ్రిగానే కాకుండా, పార్టీ అధినేతగా కూడా కేసీఆర్ కుమార్తె కవితకు  నేనున్నానన్న ధైర్యాన్ని ఇచ్చారనీ చెబుతున్నా.. ఆమె హస్తినకుబయలుదేరి వెళ్లే ముందు   కసీఆర్ ను కలవకుండానే బయలుదేరడం చూస్తే ఆ భరోసా ఆమెకు లభించినట్లు లేదని  అయితే, జరుగతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెరాస రోజుల్లో కేసీఆర్ తెరపైకి తెచ్చిన రాజకీయ, న్యాయ పోరాటాన్ని, బీఆర్ఎస్ సుదీర్ఘ కాలం కొనసాగించక తప్పదని అంటున్నారు.  నిజానికి, ఈ కుంభకోణం నుంచి ఒక్క కవిత మాత్రమే కాదు, ఇప్పటికే అరెస్ట్ అయి విచారణ ఎదుర్కుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా, ఎవరికీ కూడా ఇప్పట్లో ఉపశమనం దొరికే అవకాశాలు పెద్దగా లేవని కూడా అంటున్నారు. అందుకే మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన వెంటనే ఆయన తన  మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటుగా మరో కేసులో ఎప్పడో కొన్ని నెలల క్రితం అరెస్ట్ అయిన మరో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్  కూడా రాజీనామా చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వారి రాజీనామాలను తక్షణం ఆమోదించారు. అంటే, ఈకేసు ఇప్పట్లో తేలేది కాదని, సుదీర్ఘ కాలం పాటు రాజకీయ, న్యాయ పోరాటం తప్పదనే ఉద్దేశంతోనే, కేజ్రీవాల్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని అంటన్నారు. కవిత విషయానికి వస్తే, భూత, భవిష్యత్, వర్తమాన రాజకీయలను అవపోసన పట్టిన ముఖ్యమంత్రి కేసేఆర్ ,నిజంగా కవిత అరెస్ట్  అయితే  ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తలుస్తోంది. నిజానికి ఆరు నెలలకు పైగా ఢిల్లీ లిక్కర్ స్కాం కథ  నడుస్తున్నా, అందులో కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, చివరకు కవిత అరెస్ట్ అనివార్యమని తెలిసినా, విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ కవిత అరెస్ట్ కథలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా కేసీఆర్ ఏనాడూ ఢిల్లీ కుంభకోణం గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. చివరకు ఈడీ సమాన్లు అందుకుని ఢిల్లీ వెళ్ళే ముందు కవిత ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తారని ప్రచారం జరిగినా,  ఆమె ప్రగతి భవన్ కు వెళ్ళ కుండా నేరుగా  శంషాబాద్ విమానాశ్రయానికి  అక్కడి నుంచి ఢిల్లీకి ఒంటరిగానే వెళ్లారు.ఇదంతా కూడా కేసీఆర్ వ్యూహంలో భాగంగా జరిగిందన్న వాదన కూడా ఉంది. అది పక్కన పెడితే.. కవితను  అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి..?  ఈ విషయంలో కేసీఆర్ నెక్స్ట్  స్టెప్ట్ ఏంటి..?  ఎప్పటి నుంచో కేంద్రాన్ని ఢీకొంటున్న కేసీఆర్..  మరింత రెచ్చిపోతారా..? ప్రతిపక్ష పార్టీల అధినేతలను,  బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకులను కలుపుకొని వెళ్తారా..?  ఇప్పటికే పలు కేసుల్లో అరెస్ట్ అయిన వారితో,  విచారణను ఎదుర్కొంటున్న వారితో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారా..?  ఏది ఏమైనా   ప్రస్తుతానికి ఆయన వ్యూహం ఏమిటన్నది  గోప్యంగానే వుంది. అలాగే,ఇతర  పార్టీలు కూడా ఈ విషయాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నాయి.  మీడియా సమావేశాలలో కూడా ఈ అంశంపై  ఒకటికి, పది సార్లు చర్చించిన తర్వాతే  స్పందించనున్నారని తెలుస్తోంది. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలో ఏది పడితే అది మాట్లాడి పరువు పొగొట్టుకోవడం కంటే అన్ని తెలుసుకున్న తర్వాతే స్పందించాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి, అందరి దృష్టీ మత్రం కవిత అరెస్ట్ అయితే ... కేసీఆర్ ఏం చేస్తారన్నదానిపైనే కేంద్రీకృతం అయ్యిందని మాత్రం పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related Posts