YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బెల్టు షాపులతో బెంబేలెత్తుతున్న జనం-వీధి వీధికో బెల్టు షాప్

బెల్టు షాపులతో బెంబేలెత్తుతున్న జనం-వీధి వీధికో బెల్టు షాప్

మంథని
మంథని పట్టణ ప్రాంతంతో పాటు గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతుంది. చాప కింద నీరు వలే యువత భవిష్యత్తు మత్తులోకి వెళుతుంది. వీధి వీధికో బెల్ట్ షాపు ఏర్పాటు చేయడంతో భవిష్యత్తు భావి యువత జీవితం అంధకారంలోకి వెళ్తుంది. పోటీపడి మరి బెల్ షాపులు ప్రారంభించడం జరుగుతున్నది. గ్రామాల్లో బహిరంగంగా వేలంపాట ద్వారా బెల్ట్ షాపులు చేజిక్కించుకున్న బెల్ట్ షాపుల యజమానులు మధ్యం ప్రియుల నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు.  బెల్ట్ షాపులలో అధిక ధరకు మద్యం అమ్మడం, వంటి కార్యక్రమాలు గ్రామీణంలో కోకోల్లోలుగా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. బెల్ట్ షాపులపై కొరడా జులుపించాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో గ్రామాలలో బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయి. అధిక ధరకు మద్యం విక్రయించడం ద్వారా అప్పుచేసి మరి యువత మద్యం కొనుగోలు చేయడం ద్వారా, యువత మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. పొద్దు మాపు,  పగలు రాత్రి , అనే తేడా లేకుండా 24 గంటలు బెల్ట్ షాపులు నడవడం  వల్ల బెల్టు షాపులలో మద్యం లభించడంతో గ్రామాలలో వేకువ జాముననే మద్యం కోడై కూస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని బెల్టు షాపుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా సగటు యువత కోరుతుంది. మంథని పట్టణంలోని  పలు మద్యం షాపుల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా మద్యం వ్యాపారులు ఎమ్మార్పీ ధరకు మద్యం విక్రయించకుండా అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి నకిలీ మద్యం  విక్రయాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related Posts