YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం ఎవరికి...?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం ఎవరికి...?

హైదరాబాద్, మార్చి 11, 
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ లోకి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకరికి అధిష్టానం అవ కాశం కల్పిస్తుందని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం విశేషం.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు సీడబ్ల్యూసీ ఎంపిక ప్రక్రియ రోజురోజుకు హీట్ పెంచుతుంది.ఈ ఏడాది చివరలో అసెంబ్లి ఎన్నికలు ఉండటంతో రాష్ట్రానికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తారని వాదన బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంపికలో రాజకీయ సమీకరణాలు మారడంతో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీడబ్ల్యూసీ పదవి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.రేసులో వున్న నేతల్లో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మొదటగా ప్రధానంగా వినిపించింది. పార్టీలో సీనియర్ కావడంతో పాటు అధిష్ఠానంకు సన్నిహిత నేత కావడంతో ఉత్తమ్ కు అవకాశం కల్పిస్తారు అనే చర్చ జరిగింది. కానీ ఉత్తమ్ కి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సపోర్ట్ చేస్తూ రేవంత్ ఢిల్లీ కేంద్రంగా పావులు కదులుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే జానా రెడ్డి హుటాహుటిన డిల్లికి బయలుదేరారు. మల్లికార్జున ఖర్గ్ తో బేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ లాబీంగ్ కోసమే వెళ్లారు అన్న ప్రచారం జరుగుతుంది. మరో వైపు సామాజిక వర్గ సమీకరణల ఆధారంగా బీసీ కోటాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య తమకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అవకాశం ఇస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. సీతక్కకు రాహుల్‌ గాంధీ ఆశీస్సులు ఉండటంతో ఆమె కూడా రేస్ లో ఉందనే టాక్ వినిపిస్తుంది. కానీ రేవంత్ సీతక్కకు మద్దతు తెలపకుండా జానారెడ్డిని సీడబ్ల్యూసీ మెంబర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.ఇదంతా ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బిరామిరెడ్డి సీడబ్ల్యూసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సుబ్బి రామిరెడ్డి వైపే ప్రియాంక గాంధీ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీలో ఎవరికి చోటు లభిస్తుందా.. అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం సీడబ్ల్యూసీ పదవి తమకు దక్కుతుంది.. అంటే దక్కుతుందనే ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో సీడబ్ల్యూసీలో కేవలం ముగ్గురికే అవకాశం కల్పించారని.. వారిలో మాజీ ముఖ్య మంత్రులు కాసు బ్రహ్మానందంరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో పాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నేత కె. కేశవరావుకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది.మొత్తానికి cwc పై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇందులో కోమటిరెడ్డి, మల్లు రవి లాంటి నాయకులు మాకంటే మాకు అని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎవరి పేరు వొస్తే ఎం జరుగుతుందో అని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. అధిష్టానం వద్ద టీ కాంగ్రెస్ నేతల చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో.. ఎవరు సీడబ్ల్యూసీలో పాగా వేస్తారో వేచి చూడాలి మరి..

Related Posts