Highlights
- మెరిసిన కార్తీక్, రస్సెల్
- రాణించిన కోలకతా బౌలర్లు
- ఫైనల్ బెర్తు కోసం హైద్రాబాద్ తో ఢీ

బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. మొదట బ్యాట్టింగ్ కి వచ్చినా కోలకతా దినేశ్ కార్తీక్ (52; 38 బంతుల్లో 4×4, 2×6), ఆండ్రీ రసెల్ (49 నాటౌట్; 25 బంతుల్లో 3×4, 5×6) మెరవడంతో 7 వికెట్లకు 169 పరుగులు సాధించింది. ఛేదనలో రాజస్థాన్ అనూహ్యంగా తడబడింది. కుల్‌దీప్ యాదవ్ (1/18), పియూష్ చావ్లా (2/24), ప్రసిద్ధ్ కృష్ణ (1/28) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 4 వికెట్లకు 144 పరుగులే చేయగలిగింది. సంజు శాంసన్ (50; 38 బంతుల్లో 4×4, 2×6), రహానె (46; 41 బంతుల్లో 4×4, 1×6) రాణించిన ఫలితం లేకుండా పోయింది.. రసెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.