YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అంబర్ పేటలో మరో బాలుడిపై కుక్కల దాడి

అంబర్ పేటలో మరో బాలుడిపై కుక్కల దాడి

హైదరాబాద్
అంబర్ పేట్ డివిజన్ ప్రేమ్ నగర్ లో  ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అంబర్పేట్ డివిజన్ ఓల్డ్ ప్రేమ్ నగర్ లో నివాసముండే మణికంఠ కుమారుడు సాయి వయస్సు ఏడు సంవత్సరాలు  పాల కోసం స్థానికంగా ఉన్న కిరాణా షాపుకు వెళ్లాడు పాలు తీసుకొని తిరిగి వస్తున్న క్రమంలో అక్కడే ఉన్న మూడు వీధి కుక్కలు ఆ బాలుడిపై దాడికి పాల్పడ్డాయి ఈ ఘటనలో బాలుడి నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి దీన్ని గమనించిన స్థానికులు ఒక్కసారి గట్టిగా అరువగా కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి బాలుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు

Related Posts