బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తల్లిపై సినిమాను తీయబోతున్నట్లు కర్ణిసేన ప్రకటించింది. 'లీలా కి లీలా' పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రానికి అరవింద్ వ్యాస్ దర్శకత్వం వహిస్తారని చిత్తోర్‌గడ్ జిల్లా కర్ణిసేన అధ్యక్షుడు గోవింద్ సింగ్ కంగరౌత్ అన్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించాడు.
సంజయ్ లీలా భన్సాలీ 'పద్మావత్'తో తమ రాణి పద్మావతిని అవమానించారని.. కానీ మేం తీయబోయే చిత్రాన్ని చూసి అతడు కచ్ఛితంగా గర్వపడతారని ఆయన అన్నాడు. దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛా హక్కు ఉంటుందన్న పాయింట్‌తో భన్సాలీ పద్మావత్‌ను తెరకెక్కించారు. సరిగ్గా అదే హక్కును ఉపయోగించుకునే ఇప్పుడు మేం అంతకంటే భేషుగ్గా.. పచ్చి నిజాలను చూపిస్తాం అని కర్ణిసేన ప్రకటించింది.