YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అరెస్టులతో ఉద్యమాన్నిఆపలేరు ఓయూలో విద్యార్ధినేతల అరెస్టు

అరెస్టులతో ఉద్యమాన్నిఆపలేరు ఓయూలో విద్యార్ధినేతల అరెస్టు

హైదరాబాద్
ఓయూలో శుక్రవారం ఉదయం నిరుద్యోగ మార్చ్, మధ్యాహ్నం నిరసన దీక్ష కార్యక్రమాల  సందర్భంగా ఓయూలో విద్యార్థి నాయకులను పోలీసులు  ముందస్తు అరెస్ట్ లుచేసారు. ఉదయాన్నే వివిధ వసతి గృహల్లో పోలీసులు దాడులు జరిపి పలుమందిని అదుపులోకి తీసుకున్నారు.
ఓయూ జేఏసీ నేత శరత్ నాయక్ మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. 30 లక్షల పైగా విద్యార్థి నిరుద్యోగులు ఆవేదన పడుతుంటే ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు లీకేజ్ కి మూలకారకులైన చైర్మన్ సభ్యులను వెంటనే తొలగించాలి మొత్తం వ్యవహారంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి, ఉద్యోగ కాలండర్ ప్రకటించాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయల బృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులంతా స్వచ్ఛందంగా తరలివచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకోవాలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.

Related Posts