విశాఖపట్నం
దేవుడు చక్కగా స్క్రిప్ట్ ఇచ్చాడని,23 సంఖ్య తమకు కలిసివచ్చేటట్లు చేశా డని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మె ల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.ఏ డు ఎమ్మెల్సీ లో ఒకటి టీడీపీ అనూ హ్యంగా గెలవడం ఆ గెలుపులో వైసీపీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సహక రించడంతో టీడీపీకి ఆదరణ చెక్కు చెదరలేదన్నది స్పష్టమవుతుం దన్నా రు.హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ ఒకటే గాలి వీచిందన్నారు. ఎమ్మెల్సీ గెలవడంతో విశాఖ టీడీపీ కార్యాలయంలో గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించా రు.ఈ సందర్భంగా గంటా మాట్లాడు తూ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని వైసిపి వారే అన్నా రని, సెమీస్ లో ఓడిపోతే ఇక ఫైన ల్స్ లో స్థానం ఉండ దన్న విషయం ఇప్పటికైనా తెలు సుకో వాలన్నారు. వైసిపి కి ఇది తీవ్రమైన ప్రతికూల ఫలితాల న్నారు. జగన్కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయ్యి పోయింద ని స్పష్టమైన తీర్పుకు ఇది సంకేతమ న్నారు.సీనియర్ మిని స్టర్లను ఉపయో గించి మాక్ పోలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయింద న్నారు..