YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం

హైదరాబాద్
ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సిసి గేటు వద్ద ప్రభుత్వం కెసిఆర్ గారి దిష్టిబొమ్మను హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతారోహిత్ ఆధ్వర్యంలో కాల్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు .టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లీకేజీ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తనయుడు కేటీఆర్ విచారణ జరగక ముందే కేవలం ఇద్దరే దీంట్లో పాత్రధారులు ఉన్నారని తేల్చేయడం విడ్డూరంగా ఉందని అంటే విచారణలో నిజాయితీ లేదని తేలిపోతుందని, అదేవిధంగా టిఎస్పిఎస్సి లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కేటీఆర్ మంత్రిత్వ శాఖ నియామకాలు జరుపుతున్నప్పుడు కేటీఆర్  పాత్ర దీంట్లో ఉందని వాదనలు వస్తున్నప్పుడు కేటీఆర్ కి ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణ జరపట్లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము అందుకే వెంటనే విచారణను సిబిఐ కి లేదా సిట్టింగ్ జడ్జ్ కి బదులయించాలని యూత్ కాంగ్రెస్ హైదరాబాద్ అధ్యక్షుడు మోతారోహిత్ డిమాండ్ చేశారు.

నిరుద్యోగ మహా ధర్నా
 కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో బిజెపి అధ్వర్యంలో నిరుద్యోగ మహా ధర్నా  నిర్వహించారు.  గ్రూప్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వలి.  సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో   జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

మంత్రి ఇంద్రకరణ్ కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు
నిర్మల్ పట్టణంలోని ఈద్గాం చౌరస్తాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఎస్పిఎస్సీ  పేపర్ లీకేజీపై మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు.   కాన్వాయిని అడ్డుకున్న వారిని పోలయీసులు అరెస్టు చేసారు.

Related Posts