YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైజాగ్ లో జీ 20 సమిట్ హడావిడి

వైజాగ్ లో జీ 20 సమిట్ హడావిడి

విశాఖపట్టణం, మార్చి 25, 
శాఖలో ఈ నెల 28, 29 తేదీల్లో వైజాగ్ లో జీ -20 సదస్సు జరగనుంది. దీనిలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. జీ-20 దేశాల ప్రతినిధులు చాలా నగరాల్లో ఈ మీటింగ్స్ జరుపుతున్నారు. అందులో భాగంగా విశాఖలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ సదస్సు జరపనుంది. వైజాగ్ లోని రాడిసన్ బ్లూ హోటల్ లో రెండు రోజుల పాటు ఈ కాన్ఫెరెన్స్ నిర్వహించనున్నారు. దీనికోసం జీవీఎంసీ (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు . జీ -20 సదస్సును బేస్ చేసుకుని వైజాగ్ బ్రాండింగ్ కోసం కష్టపడుతోంది జీవీఎంసీ. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు వైజాగ్ వాసులను కూడా జీ -20 సదస్సులో పార్ట్నర్లను చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే బోట్ రేసింగ్ , కైట్ ఫెస్టివల్ లాంటి ప్రోగ్రామ్స్ ఇప్పటికే నిర్వహించింది. వీటితోపాటు ఈ వీకెండ్ లో  కార్నివాల్ , మారథాన్ లను కూడా జరపనున్నారు. అలాగే  వ్యర్ధ పదార్థాలతో కళాఖండాల ఫెస్టివల్ ను కూడా నిర్వహించనున్నారు . వీటిలో పాల్గొనేలా వైజాగ్ వాసులను ఎంకరేజ్ చేస్తుంది జీవీఎంసీ . దీనిని  "జన్ భాగిదారీ " ప్రోగ్రామ్ గా పిలుస్తున్నారు.  జీ - 20 సదస్సు నేపథ్యంలో విశాఖ సుందరీకరణ కు 100 కోట్లు కేటాయించింది ప్రభుత్వం . ఆర్కే బీచ్ నుండి రాడిసన్ బ్లూ హోటల్ వరకూ ఉన్నమార్గాన్ని అత్యంత అందంగా తయారుచేశారు . అలాగే అతిధులు చేరుకునే ఎయిర్పోర్ట్ నుండి వైజాగ్ సిటీ వరకూ ఉన్న హైవే ను సరిక్రొత్తగా మార్చేసారు . ఎటుచూసినా అతిధులకు ,ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ .. రంగురంగుల లైట్లతో వైజాగ్ ను మరింత బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దారు . అలాగే సదస్సు జరిగే ఆ రెండు రోజులూ అంటే 28,29 తేదీలలో వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి . దీనికి సహకరించాలి అని పోలీసులు వైజాగ్ వాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  

Related Posts