YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎట్టకేలకు రాజమండ్రి బ్రిడ్జి మరమ్మత్తు పనులు

ఎట్టకేలకు రాజమండ్రి బ్రిడ్జి మరమ్మత్తు పనులు

రాజమండ్రి, మార్చిచ 27, 
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి - కొవ్వూరు  రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జిపై హ్యాండ్ రైల్, ఫుట్ పాత్ ల మరమ్మత్తులు చేపట్టారు. దీంతో ఈ నెల 26న ఆదివారం బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ బీవీ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్ కం రైల్ వంతెన హ్యాండ్ రైలింగ్, పుట్ పాత్ పనులను చేపట్టేందుకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆర్ అండ్ బి, రైల్వే అధికారుల అభ్యర్థన మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ బీవీ రెడ్డి తెలియచేశారు. కావున మార్చి 26 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై ఏ విధమైన వాహనాలు అనుమతించరని ప్రజలకు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకి ప్రజలు సహకరించాలని కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిలాల్లోని ప్రధాన రహదారి గోదావరి నదిపై కొలువుదీరిన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి అత్యవసర మరమత్తులు కోసం గత ఏడాది అక్టోబర్ లో వారం రోజుల పాటు తాత్కాలికంగా మూసివేశారు.  రోడ్ కం రైల్వే బ్రిడ్జికు సంబంధించి రిపేర్ పనులను ఆర్‌అండ్‌బీ, రైల్వే శాఖల ఆధ్వర్యంలో పనులు నిర్వహించారు. వంతెనపై రోడ్డు మార్గం, రెయిలింగ్ , ఫుట్ పాత్ పూర్తిగా దెబ్బ తిన్నాయని వాటిని మరమ్మత్తు చేసేందుకు అప్పట్లో వాహనరాకపోకలు నిలిపివేశారు.  ద్విచక్ర వాహనాలు, మోటార్ బైక్స్, కార్లు, ఆర్టీసీ బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా మళ్లించారు. లారీలు, భారీవాహనాలు, ప్రైవేట్ బస్సులు, కమర్షియల్ వాహనాల సహా ఇతర వాహనాలను కొవ్వూరు – రాజమండ్రి 4వ వంతెన మీదుగా మళ్లించారు.  తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలను వేరుచేసే గోదావరి నదిపై రాజమండ్రి-కొవ్వూరు మధ్య భారీ వంతెనలు కనిపిస్తాయి. ఈ వంతెనలు ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు చాలా కీలకం.  ఈ వంతెనల్లో ముఖ్యమైన వాటిల్లో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి ఒకటి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రోడ్ కమ్ రైల్వే వంతెనల్లో ఇది మూడో స్థానంలో ఉంది. 1970లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభం కాగా... 1974 ఆగష్టు 16న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ ఆహమ్మద్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ వంతెన పొడవు మొత్తం 4.1 కిలోమీటర్లుగా ఉంది. ఇందులో 2.8 కిమీ రైలు భాగం,  4.1 కిమీ రహదారి పొడవు ఉంటుంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లోని గ్రాఫ్టన్ బ్రిడ్జ్ మాదిరిగానే ఈ వంతెన సింగిల్ ట్రాక్ రైలు డెక్‌పై రోడ్డు డెక్‌ను కలిగి ఉంది.   ఇది రాజమండ్రి గుర్తింపు పొందిన చిహ్నాలలో ఒకటి. ఈ వంతెనను ఇండియన్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే నిర్మించాయి. 1970లో ఈ బ్రిడ్జిని  బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ, భారత్ హేవీ ఉద్యోగ్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన గ్రూప్ కంపెనీలు నిర్మించాయి.  

Related Posts