YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇక తిరుమలలో నో పొల్యూషన్ బస్సులు

ఇక తిరుమలలో నో పొల్యూషన్ బస్సులు

తిరుమల, మార్చి 28, 
తిరుమలలో సామాన్య భక్తుల కోసం 10 ఉచిత ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మెన్ వైవీ.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ధర్మరథాల పేరుతో సామాన్య భక్తుల సౌకర్యార్థం డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తాయని తెలిపారు. ఒక్కో బస్సు విలువ కోటి 80 లక్షల ఉంటుందని మొత్తం 18 కోట్లు విలువచేసే పది ఒలెక్ట్రా  కంపెనీ బస్సులను మెగా ఇంజినీరింగ్ సంస్థ  విరాళంగా అందజేసిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏడాది క్రితమే ప్రారంభించామని అన్నారు. అందులో భాగంగా అధికారులు సిబ్బందికి విధి నిర్వహణ కోసం ఎలక్ట్రిక్ కార్లను ఇచ్చామని తెలిపారు. అనంతర కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చొరవతో 65 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ప్రతిరోజు తిరుపతి నుంచి తిరుమల మధ్య నడుపుతోందని అన్నారు. తాజాగా పది ఎలక్ట్రిక్ బస్సుల కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటికే తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. లడ్డు కౌంటర్లలో ప్లాస్టిక్ రహిత కవర్లతో పాటు తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్లను పూర్తిస్థాయిలో నిషేధించామని తెలిపారు.రాబోయే రోజుల్లో తిరుమలలో పర్యావరణం కాపాడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. "భక్తుల కోసం ఉచిత బస్సులను టీటీడీ నడుపుతుంది. తిరుమల కొండపై పర్యావరణ కాపాడేలా పది ఎలక్ట్రిక్ బస్సులు మెగా సంస్థ టీటీడీకి అందించింది. వారంలో రోజుల్లో ఈ బస్సులు తిరుమలలో అందుబాటులోకి రానున్నాయి. తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ  వల్ల గదుల కేటాయింపు పారదర్శంగా జరుగుతుంది. వేసవిలో భక్తులకు ఇబ్బందులు లేకుండా విసృత్త ఏర్పాట్లు చేస్తున్నాం. మాడ వీధుల్లో చల్లటి పాయింటింగ్, చలువపందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. వేసవిలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తాం. ఎఫ్.సి.అర్.ఏ నిభందనలకు విరుద్ధంగా విదేశాల నుంచి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీ ఆర్బీఐ 3 కోట్ల జరిమానా వేసింది. ఆర్బీఐ వేసినా జరిమానాను త్వరలో కట్టేస్తాం. త్వరలో విదేశాల నుంచి వచ్చే ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకుంటాం. టీటీడీకి ఉన్న ఎఫ్.సి.ఆర్.ఏ లైసెన్స్ కాలపరిమితి ముగియడంతో రెన్యూవల్ చేయమని ఆర్బీఐను కోరాం. హుండీలో కానుకల ద్వారా టీటీడీ ఖజనాలో రూ.30 కోట్లు విదేశీ కరెన్సీ ఉంది."-వైవీ.సుబ్బారెడ్డి మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్)  తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా పది ఎలక్ట్రిక్  బస్సుల అందించింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్ లో తయారు చేసింది. టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును ఇటీవల దేవస్థానం రవాణా విభాగం జనరల్ మేనేజర్ పీవీ శేషారెడ్డి  సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన  అత్యాధునిక సౌకర్యాలు కలిగిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి  అందించాలని ఎంఈఐఎల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే  భక్తులకు పరిశుభ్రమైన, వాయు, శబ్ధ కాలుష్యంలేని ప్రయాణాన్ని ఈ విద్యుత్ బస్సుల ద్వారా  అందించాలేని ఈ బస్సులు అందించినట్లు ఒలెక్ట్రా ప్రతినిధులు తెలిపారు. ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న  ఆశాభావాన్ని  వ్యక్తం చేశారు.

Related Posts