YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం

రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం

ఖమ్మం, మార్చి 29, 
శ్రీరామ నవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతుంది. భద్రాచలంలో మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో సీతారాముల కల్యాణం జరపనున్నారు. భద్రాద్రిలో ఎటుచూసినా స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో కల్యాణ వైభవం కనిపిస్తోంది. రాములోరి కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు తరలిరానున్న అశేష భక్తజనానికి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 15వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా రాములోరి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. ఈనెల 31న శ్రీరామ సామాజ్ర్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
ఈవేడుకలను భక్తులు వీక్షించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో శ్రీసీతారామ చంద్ర స్వామి కళ్యాణం మార్చి 30న నిర్వహించనున్నారు. దీని కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. ఏటా శ్రీరామ నవమి రోజునే భద్రాచలంలో అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. మిట్ట మధ్యాహ్నం ప్రతి యేడాది ఈ కళ్యాణం జరుగుతుంది. అయితే శ్రీరామ నవమి రోజునే కళ్యాణం భద్రాచలంలో ఎప్పుడు జరుగుతుందో అదే సమయంలో అయోధ్యలో కూడా కళ్యాణం జరుగుతుంది. వాడవాడలా కళ్యాణాలు జరుగుతుంటాయి.జానక్యా: కమలాంజనలి పుటే యా: పద్మరాగాయతా: సీతాదేవి చేతుల్లో ఉన్న ముత్యాలు పద్మ రామమణుల్లా ప్రకాశించాయి. శ్రీ రాముడి శిరస్సుపై పడ్డ ఆముత్యాలు తెల్లని తలపాగా కాంతిలో కలిసి మంచి ముత్యాలుగా ప్రకాశిస్తాయి. నీలి మేఘ ఛాయ కలిగిన శ్రీరాముడి దేహం నుంచి జారిన తలంబ్రాలు ఇంద్రలీలామణుల్లా ప్రకాశిస్తాయిని, సీతారాముల కళ్యాణ తలంబ్రాలు ముత్యాలు సఖల శుభాలను కలగచేస్తాయని ఆదిశంకరాచార్యులు చెప్పారంట. వివాహ వేడుకల్లో అత్యంత ప్రాముఖ్యమైనది తలంబ్రాలు..భద్రాద్రి శ్రీరాముడి తలంబ్రాలకు ఒక్క ప్రత్యేకత కూడా ఉంటుంది. అన్ని కల్యాణాల్లో తలంబ్రాలు పసుపు పచ్చగా ఉంటాయి. కానీ ఇక్కడ ఎరుపురంగులో ఉండడం విశేషంగా చెబుతారు. భద్రాచలంలో శ్రీసీతారామ చంద్ర స్వామి కళ్యాణంలో తలంబ్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈరోజు పెళ్లి కొడుకును చేసి ముత్తైవుదుల సమక్షంలో తలంబ్రాలను కలుపుతుంటారు. నైజామ్ నవాబు ముత్యాల తలంబ్రాలను , వారి ఆచారం ప్రకారం గులాం కలిపి పంపించే వారు. ప్రధానంగా నైజాం నవాబు కళ్యాణం కోసం బియ్యం, పసుపు తో పాటు, వారి ఆచార సాంప్రదాయం అయిన గులాల్ ను కూడ కలిపి పంపారంట. దీంతో అవి ఎరుపురంగులో ఉండేవి. భద్రాచలంలో తలంబ్రాలకు విశేష ప్రాధాన్యత ఉంది.రాష్ట్రం నుంచే కాకుండా దేశం నుంచే చాలా మంది ఈ తలంబ్రాలు కావాలని కోరుకుంటారు. వివాహ సమయంలో ఈ తలంబ్రాలను కలిపితే మంచి జరుగుతుందని, శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం దీని వల్ల దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారని భావిస్తుంటారు. అయితే అవి రెండు కలసి పోయి తలంబ్రాలు ఎర్రగా మారాయని అంటారు. అందువల్ల అప్పటి నుంచి ముత్యాల తలంబ్రాలలో సెంట్ తోపాటు సుగంధ ద్రవ్యాలను కలుపడం ఆనవాయితీగా మారింది. 2022లో మాత్రమే భక్తుల సమక్షంలో శ్రీసీతారామచంద్రుల వివాహం జరిగింది. అంతకుముందు కరోనా వల్ల కేవలం అర్చకుల సమక్షంలోనే కళ్యాణ వైభోగం నిర్వహించారు.

Related Posts