విశాఖపట్టణం, ఏప్రిల్ 1,
ఏపీ మంత్రి వర్గంలో మార్పులు జరుగుతాయని గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ చర్చను బలపర్చే పరిణామాలు ఏపీలో జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు కీలక నేతలకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజుతో సీఎం జగన్ తో విడివిడిగా భేటీ అయ్యారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలతో ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో మరోసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రచారం మొదలైంది. ప్రస్తుత మంత్రివర్గం నుంచి కొందరిని తప్పిస్తారని జోరుగా సాగుతుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజుకు ఇవాళ సీఎం కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన తాడేపల్లి వచ్చి సీఎం జగన్ ను కలిశారు. అనంతరం మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ లో ఉన్నా లేకపోయినా బాధపడనని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు ప్రజాసేవ ముఖ్యమన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై తనకు సమాచారం లేదన్నారు. తన దృష్టిలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ మంత్రులేనన్నారు. పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై తనకు సమాచారం లేదన్నారు. మంత్రి పదవి కంటే తనకు ప్రజాసేవే ముఖ్యమన్నారు. బీసీల నుంచి వచ్చిన తనకు సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ... సీఎం జగన్ మంత్రి పదవి ఇచ్చారు. తొలి సారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మోపిదేవి వెంకటరమణకు సీఎం జగన్ మంత్రిపదవి ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. మండలి రద్దు తీర్మానం చేసిన తర్వాత వారిని మంత్రి పదవుల నుంచి తప్పించారు. అదే సామాజికవర్గం నుంచి సీదిరి అప్పలరాజుకు చాన్స్ ఇచ్చారు. మంత్రులందరితో రాజీనామాలు తీసుకున్నప్పుడు సీదిరి అప్పలరాజుతోనూ రాజీనామా చేయించారు.. కానీ మళ్లీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆయన మంత్రి పదవి కంటిన్యూ అవుతున్నారు. సీఎం జగన్ తో స్పీకర్ తమ్మినేని సీతారాం భేటీ అయ్యారు. సీఎం జగన్ తో మంత్రి అప్పలరాజు సమావేశం ముగిసిన అనంతరం తమ్మినేని కలిశారు. స్పీకర్ తమ్మినేని మంత్రి కాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రలో దూకుడుగా వెళ్లేందుకు తమ్మినేనికి సీఎం జగన్ కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. స్పీకర్ గా ఉండి కూడా ప్రభుత్వం తరఫున తమ్మినేని పలుమార్లు కీలక వ్యాఖ్యలుు చేశారు. ప్రతిపక్షాలపై పదునైన విమర్శలు చేయడంలో తమ్మినేని ముందుంటున్నారు. మరో మంత్రి బొత్సా తీరుపై సీఎం జగన్ అసహనంగా ఉన్నారని తెలుస్తోంది. మంత్రిగా ఉండి కూడా ఉత్తరాంధ్రలో ఉత్సాహంగా ఉండడంలేదని బొత్సా తీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.