YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ ఆఫీసుల్లో టీకి డబ్బుల్లేవంటా

కాంగ్రెస్ ఆఫీసుల్లో టీకి డబ్బుల్లేవంటా

పార్టీ రాష్ట్ర కార్యాలయాల నిర్వహణకు అధిష్ఠానం నిధులు పంపకపోవడమే అందుకు నిదర్శనం. నిధుల కొరత నేపథ్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో టీ అందించే విషయంలో కూడా కోతలు పెడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టాలు తప్పవు. 2013లో 15 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఒక్కో రాష్ర్టాన్ని కోల్పోతూ వస్తున్నది. దీంతో పార్టీకి నిధుల కొరత నానాటికీ ఎక్కువైంది. రాష్ర్టాల్లో అధికారంలో ఉండే పార్టీ రాష్ట్ర శాఖలు జాతీయ పార్టీలకు కామధేనువుల్లా పనిచేస్తాయి. కాంగ్రెస్ ముక్త్‌భారత్ అని నినదిస్తున్న ప్రధాని మోదీని గద్దె దింపాలని భావిస్తున్న పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఇది అతిపెద్ద సవాల్‌గా మారనున్నది. అత్యంత ధనిక పార్టీగా నిలిచిన బీజేపీని ఎన్నికల్లో ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి కత్తిమీదసాములా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే నిధుల కొరతకు సంబంధించి కాంగ్రెస్ వర్గాలు మీడియా ఎదుట నోరు విప్పే సాహసం చేయడం లేదు. మరోవైపు నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సభ్యులు ముమ్మరంగా పార్టీకి విరాళాలు ఇవ్వాలని, విరాళాలు సేకరించాలని, నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవాలని ఉన్నతస్థాయి నేతలు సూచిస్తున్నారు. పారిశ్రామికవేత్తల నుంచి అందిన అరకొర నిధులన్నీ ఖర్చయిపోయిన ప్రజల నుంచి విరాళాలు తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏర్పడుతున్నది. కాంగ్రెస్ ప్రాభవం కోల్పోతున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు బీజేపీవైపు మల్లుతున్నారని వాషింగ్టన్‌లోని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సౌత్‌ఏసియా విభాగం సీనియర్ ఫెలో మిలాన్ వైష్ణవ్ పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ అధికారప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఈ విశ్లేషణను తోసిపుచ్చారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ నిధులతో పోల్చితే కాంగ్రెస్‌కు నాలుగో వంతు నిధులు మాత్రమే వచ్చాయని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తేల్చింది. ఈ సంవత్సరం బీజేపీ రూ.1,034 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 81 శాతం అధికం. ఇదేకాలంలో కాంగ్రెస్ ఆదాయం రూ.225 కోట్లు కాగా అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం తక్కువ. విమాన టికెట్లు లేక ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరిగిన ఓ రాష్ర్టానికి చేరుకోలేకపోయారంటే కాంగ్రెస్‌లో నిధుల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది,

Related Posts