YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పవన్ సీఎం ప్రకటిస్తే..వైసీపీ ఓటమి

పవన్ సీఎం ప్రకటిస్తే..వైసీపీ ఓటమి

కాకినాడ, ఏప్రిల్ 1,
పవన్ కల్యాణ్ ఐదేళ్లు సీఎంగా ఉండాలంటే జనసేన 175 స్థానాల్లో పోటీ చేయాలని   కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య వ్యాఖ్యానించారు.  జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ఐదేళ్లు సీఎంగా ఉంటారని అన్నారు. బీజేపీతో కలిస్తే మోదీ చరిష్మా తోడయి అదనపు బలం చేకూరుతుందని అన్నారు. టీడీపీ జనసేనతో కలిస్తే ఇక వైసీపీ ఓటమి ఖాయమని హరిరామ జోగయ్య జోస్యం చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తేనే వైసీపీని ఓడించగలరని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని జోగయ్య డిమాండ్ చేశారు. గతం కంటే జనసేన బలం పెరిగింది.. మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ 5 ఏళ్లు సీఎంగా  ఉంటారన్నారు. హరిరామ జోగయ్య గత కొంతకాలంగా పవన్ సీఎం కావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతనే పొత్తు కుదుర్చుకోవాలని హరిరామ జోగయ్య అనేక సార్లు అన్నారు. అలా కాకుండా కేవలం మంత్రి పదవులతో సరిపెట్టుకుంటూ పొత్తు కుదుర్చుకుంటే ప్రయోజనం ఉండదని కూడా సూచించారు. చంద్రబాబు ఈ విషయంపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే పొత్తుకు దిగాలని హరిరామ జోగయ్య సూచిస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ మాత్రం తాను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనంటూ, ఆత్మగౌరవానికి దెబ్బకలగకుండా పొత్తుల నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.పొత్తులపై ఇతర పార్టీల  మైండ్ గేమ్‌లో పడొద్దని తమ పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ చెబుతున్నారు.    ఆంధ్రప్రదేశ రాజకీయాలకు మనం స్పష్టంగా ఉందాం. మనం చేసేది చెబుదాం. పొత్తులు, ఎత్తులపై మనకంటూ ఒక లైన్ ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నాయకులకు హితబోధన చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయాలు ఒక ఎత్తు, మనం చేసే  రాజకీయం మరో ఎత్తంటూ నేతలకు పవన్ ప్రత్యేంగా క్లాస్ తీసుకుంటున్నారు. పదేళ్ళ రాజకీయ ప్రస్థానంలో మనం చూసింది, చేసింది, చెప్పేది, వీటన్నింటకి చాలా వ్యత్యాసం ఉందని, పవన్ తన అభిప్రాయాలను నాయకుల ముందుంచుతున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో తనను కలసిన నాయకులతో పవన్ చాలా డిఫరెంట్‌గా మాట్లాడుతుండటం చర్చనీయాశంగా మారింది. పదో ఆవిర్భావ దినోత్సం సభలో తన ప్రసంగంలో కూడా డిఫరెంట్ స్టైల్ చూపించిన పవన్ ఆ తరవాత నుంచి సినిమా షూటింగ్‌లలో బిజగా ఉంటున్నారు. అయితే సమయం దొరికినప్పుడల్లా తనను కలసిన పార్టీ నేతలో పవన్ భవిష్యత్ కార్యక్రమాలు అంటూ కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారు. పలు దఫాలుగా నేతలతో మాట్లాడుతూ... కేడర్‌కు చెప్పాల్సిన విషయాలను సూటిగా చెబుతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటి వరకు పరిస్థితులు వేరు, ఇప్పడు పరిస్థితులు వేరు కాబట్టి రాజకీయాల్లో మనం నిలబడాలంటే ముందుగా ఎదుటి వారి ట్రాప్‌లో పడకూడదని పవన్ పదే పదే చెబుతున్నారు. కానీ కొంత మంది నేతలు మాత్రం పూర్తిగా పొత్తుల గురించే మాట్లాడుతున్నారు.    

Related Posts